యాదాద్రి భువనగిరి, మే 3 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుపై సానర్లు, ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కలెక్టర్ ప్రొఫైల్ పిక్చర్, పేరు, సెల్ నం.6374783161తో కూడిన వాట్సాప్‌ను సృష్టించారు. ఇదే నంబరుతో అధికారులతోపాటు మరికొందరికి మెసేజ్ చేశారు. ‘హలో వాట్ ఆర్ యూ డూయింగ్.. వేర్ ఆర్ యూ ఎట్ ది మూమెంట్’ అంటూ మెసేజ్ చేశారు.
ఈ విషయం కలెక్టర్‌కు తెలియడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. భువనగిరి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టగా, చెన్నై నుంచి ఓ ఆగంతకుడు ఆపరేట్ చేసినట్టు తేలింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఫొటోతో పాటు కలెక్టర్ పేరును తొలగించారు. ఫేక్ మెసేజ్‌లకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ సూచించారు.