సజావుగా నీట్
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- నల్లగొండలో 2,142, సూర్యాపేటలో918 మంది హాజరు
- రెండు జిల్లాల్లో 11 సెంటర్లలో పరీక్ష
- విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడిగా కేంద్రాలు
రామగిరి, మే 7 : వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,163 మందికి 2,142 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నీట్ సిటీ కో ఆర్డినేటర్ పార్థసారథి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. తిరుగు ప్రయాణంలో నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కిక్కిరిసింది.
సూర్యాపేట జిల్లాలో : సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షను అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 918మంది విద్యార్థులకు 908 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకర్ పరిశీలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

