బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి : సర్పంచ్ కొరుకుప్పల నరేష్
తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా పార్టీలకతీతంగా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్పుల నరేష్ గౌడ్ అన్నారు.
తుంగతుర్తి, జూలై 18 : తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా పార్టీలకతీతంగా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్పుల నరేష్ గౌడ్ అన్నారు. శనివారం బండ రామారం సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటింటికి తిరిగి, పాఠశాలకు 9 మంది విద్యార్థులు హాజరయ్యేలా చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండు సంవత్సరాలుగా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ మధ్య సఖ్యత లోపించదని దీని కారణంగానే, పరిస్థితులు టీసీలు ఇవ్వడానికి దారితీశాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జరిగిన సంఘటనపై డీఈఓ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు రాజకీయాలకతీతంగా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద తాటికొండ సీతయ్య విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోడేటి యాదగిరి, ఉపాధ్యాయులు కోటయ్య, శ్రీనివాస్, నరేష్, లింగన్న, మహేందర్, లింగస్వామి, రాజు, వెంకన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

