డిండి ఎత్తిపోతల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం
దేవరకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మరోసారి గెలిపిస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తానని చెప్పారు.
- రూ.6,340 కోట్లతో ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి
- చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లో రూ.600 కోట్లతో మరో ఐదు లిఫ్ట్ పనులు
- దేవరకొండ ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి
- నియోజకవర్గానికి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తాం
- పట్టణాలతోపాటు గ్రామాల్లో మరింత ప్రగతికి కృషి
- పదేండ్లలో రూ.12వేల కోట్ల పనులు చేశాం..
- మరోసారి అవకాశమిస్తే పెండింగ్ పనులు పూర్తి
- బీఆర్ఎస్ దేవరకొండ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, నవంబర్ 27: దేవరకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మరోసారి గెలిపిస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.12వేల కోట్ల అభివృద్ధి ప నులు పూర్తిచేశామన్నారు. సోమవారం నమస్తే తెలంగాణతో పలు అంశాలు చర్చించారు.
చురుగ్గా ఐదు లిఫ్ట్‌ల పనులు
నియోజకవర్గంలోని చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లో ఐదు లిఙ్ట్లను రూ.600 కోట్లుతో నిధులు మంజూరు చేసుకొని పనులు చేపట్టాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన రైతులను ఏప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఐదు లిఫ్ట్‌ల ద్వారా గుట్టుల ప్రాంతంలో సాగునీరు అందించి పచ్చదనంగా ఉండాలని లిఫ్ట్‌లను మంజూరు చేశాం. ఇప్పటికే ఐదు లిఫ్ట్‌ల పనులు టెండర్లు పూర్తయి పనులు చురుకుగా సాగుతున్నాయ్. మూడోసారి కేసీఆర్ సీఎం కాగానే ఆ లిఫ్ట్‌లను పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. గుట్టల ప్రాతంలో రైతులు సంతోషంగా రెండు పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలనేదే సీఎం కేసీఆర్ ఆశయం.
రూ.5కోట్లతో పర్యాటక పార్కు
రా్రష్ట్రంలో దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తా. ఇప్పటికే ఖిల్లాలో పర్యాటక పార్కుకు రూ.5కోట్లతో అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పనులు పూర్తి చేసి పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉండేలా చేస్తా.
రూ. 100 కోట్లతో దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధి
దేవరకొండ మున్సిపాల్టీని రూ.100 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నాం. ఇప్పటికే రూ.100 కోట్ల నిధులచే అండర్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిధులు పనులు పూరి చేసుకొని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారం చేపట్టగానే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా.
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు మంజూరుకు కృషి
దేవరకొండలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసేందుకు కృషి చేస్తా. దీంతో పాటు ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయనున్నాం. మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మిగిలిన పనులు త్వరతిగతిన పూర్తి చేస్తాం.
రూ.6340 కోట్లతో డిండి ఎత్తిపోతల పనులు
నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు రూ.6340 కోట్ల నిధులతో డిండి ఎత్తిపోతల పధకం పనులు చేపట్టాం. నాలుగో సారి తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. ఇప్పటికే గొట్టిముక్కల, సింగరాజ్‌పల్లి ప్రాజెక్టులు 95 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 రిజార్వాయర్ల్ల పనులు కొనసాగుతున్నాయి. మళ్లీ ఎమ్మెల్యేగా గెల్చిన అనంతరం రిజర్వాయర్లు పనులు పూర్తి చేసుకొని సాగునీరు నియోజకవర్గంలో అందిస్తాం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

