ఉజ్వల భవిష్యత్‌కు నవోదయం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది జవహర్ నవోదయ విద్యాలయం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్లో దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి చలకుర్తి గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయాన్ని నిర్మించారు.
- వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు దరఖాస్తుల
- చలకుర్తి జేఎన్వీలో ఉమ్మడి జిల్లాకు 80 సీట్లు కేటాయింపు
- దరఖాస్తులకు చివరి గడువు ఆగస్టు 10
- 2024 జనవరి 20న ప్రవేశ పరీక్ష
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది జవహర్ నవోదయ విద్యాలయం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్లో దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి చలకుర్తి గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయాన్ని నిర్మించారు. ఇందులో 6నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బాల బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. 6నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృ భాషలో విద్యా బోధన జరుగుతున్నది. ఆ తర్వాత గణితం, సైన్స్ సబ్జెక్టులు ఆంగ్ల భాషలో, సామాజిక శాస్ర్తం హిందీలో బోధిస్తారు.
– పెద్దవూర, జూలై 10
దరఖాస్తులు షురూ..
జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరానికిగానూ 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదల అయ్యింది. అన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వరకు గడువు విధించింది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2024 జనవరి 20న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చలకుర్తిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు కేటాయించారు. 6వ తరగతిలో ప్రవేశానికిగాను ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఎన్వీనల్గొండ.ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంపై ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5వ తరగతి ఏ పాఠశాలలో చదువుతున్నారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని అప్లోడ్ చేయాలి. దరఖాస్తుపై విద్యార్థి, తండ్రి సంతకాలు తప్పకుండా ఉండాలి. ఫొటో కూడా అప్లోడ్ చేయాలి.
అర్హులు వీరే..
చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా.. అందులో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించాలంటే 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఏ ఒక్క రోజూ పట్టణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో చదివినా గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించదు. ఒక్కసారి పరీక్షకు హాజరైన విద్యార్థి రెండోసారి రాసేందుకు అవకాశం లేదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5, బాలికలకు మొత్తం సీట్లలో 1/3 వంతు రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ 2012 మే 1నుంచి 2014 జూలై 31 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీ సహా అన్ని వర్గాలకు వర్తిస్తుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

