సూర్యాపేట, జూలై 19 : మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆదివారం కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కాన్వొకేషన్ కోసం సింగపూర్ వెళ్లి అర్థరాత్రి తిరిగి వచ్చిన జగదీశ్‌రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నివాసానికి చేరుకున్న జగదీశ్‌రెడ్డిని వేద బ్రాహ్మణులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు జగదీశ్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, గొంగిడి సునీత, పల్లా శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.

Nalgonda
జగదీశ్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
యాదగిరిగుట్ట, జూలై 19: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం సునీతారెడ్డి ప్రసాదాన్ని, శేష వస్ర్తాన్ని అందజేసి నిండునూరేళ్ల ఆనందంతో గడపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, నాయకుడు శారాజీ రాజేశ్ యాదవ్ పాల్గొన్నారు.
కేక్ కట్ చేసి జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు
భువనగిరి కలెక్టరేట్, జూలై 19 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని జగదీశ్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.