వాన జాడేది?
వరుణుడు కరుణ చూపడం లేదు. వారాలు గడుస్తున్నా జిల్లాలో వానలు పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు(ఎం)లో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేమీ లేక వరుణ దేవా కరుణించు అని వివిధ రకాల పద్ధతుల్లో పూజలు చేస్తున్నారు.
- జిల్లాలో ఎక్కడా కానరాని వర్షాలు
- ఆరు మండలాల్లో లోటు వర్షపాతం10CPL10
- ఆత్మకూరు (ఎం)లో 61శాతం లోటు
- మండలాల్లో పెరుగని భూగర్భ జలాలు
- చాలా చోట్ల మొలకెత్తని విత్తనాలు.. ఆందోళనలో అన్నదాత
- కప్పలకు పెళ్లిళ్లు, కాముడు ఆటలు,బతుకమ్మలు
- వరుణుడా కరుణ చూపాలంటూ అంతటా పూజలు
వరుణుడు కరుణ చూపడం లేదు. వారాలు గడుస్తున్నా జిల్లాలో వానలు పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు(ఎం)లో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేమీ లేక వరుణ దేవా కరుణించు అని వివిధ రకాల పద్ధతుల్లో పూజలు చేస్తున్నారు.
జిల్లాలో ఈ సీజన్లో 151.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 132.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే రికార్డయ్యింది. ఆత్మకూరు (ఎం) మండలంలో 61శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. బీబీనగర్, చౌటుప్పల్, రామన్నపేట, అడ్డగూడూరు, గుండాల మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఇక రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, నారాయణపురం, మోత్కూరులో లోటు వర్షపాతానికి అతి దగ్గరలో ఉన్నాయి. తుర్కపల్లి, భువనగిరిలో మాత్రం కాస్త ఆశించిన స్థాయిలో వర్షాలు పడ్డాయని లెక్కలు చెబుతున్నాయి.
మొలకెత్తని విత్తనాలు.. ఆందోళనలో రైతులు
వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,59,850 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,85,000 ఎకరాల్లో వరి, 1,35,000 ఎకరాల్లో పత్తి, 8500 ఎకరాల్లో పప్పు గింజలు, 200 ఎకరాల్లో మిల్లెట్లు, 150 ఎకరాల్లో ఆయిల్ సీడ్స్, 21వేల ఎకరాల్లో ఇతర పంటలు వేసే అవకాశం ఉందని భావించింది. ఇంతవరకు బాగానే ఉన్నా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో సీజన్ ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి, భూములను సిద్ధం చేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వర్షాలు ఆలస్యమై విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు.
వరుణదేవా కరుణించు..
రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా ముందుకు సాగడంలేదు. వర్షాలు లేకపోవడంతో మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపించడంలేదు. జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మినహా వన మహోత్సవం ఊపందుకోలేదు. మరోవైపు వర్షాల కోసం ప్రజలు వరుణుడిని వేడుకుంటున్నారు. బొడ్రాయిలకు జలాభిషేకాలు చేస్తున్నారు. కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. వర్షాలు పడాలని కాముడు, బతుకమ్మ ఆడుతున్నారు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో వరుసగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండటం కనిపించింది. పందేండ్ల తర్వాత వర్షాలు లేవని, కరువుఛాయలు కనిపిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

