మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:05:53

అచ్చంపేట డిపోకు ఒకే రోజు రూ.16 లక్షల ఆదాయం

అచ్చంపేట డిపోకు ఒకే రోజు రూ.16 లక్షల ఆదాయం

అచ్చంపేట రూరల్‌: అచ్చంపేట ఆర్టీసీ డిపో చరిత్రలో ఒకే రోజు రూ. 16లక్షల ఆదాయం రావడం ఇదే ప్రథమమని డిపో మేనేజర్‌ మనోహర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివరాలను వెల్లడించారు. ఈనెల 12 నుంచి 20వరకు సంక్రాంతి, రంగాపూర్‌ జాతర సందర్భంగా అత్యధిక ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. డిపోకు సాధారణంగా ప్రతిరోజు రూ.8 లక్షల వరకు ఆదాయం వచ్చేదన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న రూ.15.54 లక్షలు, 13న రూ.12.22 లక్షలు, 14న రూ.10.63 లక్షలు, 17న రూ.13.56లక్షలు, 18న అత్యధికంగా రూ.16.20లక్షలు, 19న రూ.14.58 లక్షలు, 20న రూ.15.80 లక్షలు వచ్చినట్లు గుర్తు చేశారు. గతంలో ఎప్పుడు ఇంత మొత్తంలో ఆదాయం రాలేదన్నారు. ఈ ఏడాది జనవరిలో రంగాపూర్‌ జాతరకు మొత్తం 23 వేల 150 కిలో మీటర్లు బస్సులు తిరగగా అత్యధికంగా రూ. 10 లక్షల 22 వేల 996 ఆదాయం వచ్చిందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని 9డిపోల పరిధిలో అచ్చంపేట డిపో ఐదు రోజుల పాటు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. logo