స్క్రిప్ట్ బాగుంటే.. ఓకే!
చాలా సంవత్సరాల తర్వాత.. ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ద్వారా జీ తెలుగులో నటిస్తున్నా. నా పాత్రలో అన్ని భావోద్వేగాలూ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో కుటుంబం గురించి ఆలోచించే పాత్ర నాది.
చాలా సంవత్సరాల తర్వాత.. ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ద్వారా జీ తెలుగులో నటిస్తున్నా. నా పాత్రలో అన్ని భావోద్వేగాలూ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో కుటుంబం గురించి ఆలోచించే పాత్ర నాది. చాలా ఆసక్తికరమైన కథ. నేను ‘ఆత్మ’గానూ కనిపిస్తాను. నిజానికి నాకు దయ్యాలంటే భయం. కానీ, ఆత్మగా నటించేసరికి ఆ భయం పోయింది. ఈసారి ఎక్కడైనా ఆత్మలు ఎదురైతే.. హాయ్ చెబుతాను! కాఫీకి పిలుస్తాను!

గారాలపట్టిని
నా బాల్యం గురించి చెప్పాలంటే.. మా ఇంట్లో అందరూ మగపిల్లలే. నేనొక్కదాన్నే అమ్మాయిని. దీంతో మహా గోముగా పెంచారు. ఎవరో ఒకరు నన్ను ఎత్తుకుని ఆడించేవారు. ఓసారి తడి నేల మీద ఆడుకుంటూ కింద పడిపోయానట. అప్పటి నుంచి అదో ఫోబియాగా మారింది. ఎక్కడ తడి కనిపించినా ఠక్కున ఆగిపోతాను. జాగ్రత్తగా అడుగు లేస్తాను. బాల్యం నుంచీ అమ్మంటే ప్రేమ. కానీ, నాన్న దగ్గరే గారాబం ఎక్కువ.
తనకేమో తరచూ టూర్స్ ఉండేవి. దీంతో ఇంటికి రాగానే అందరి మీదా ఫిర్యాదు చేసేదాన్ని. నా ముందు అందర్నీ తిడుతున్నట్టు నటించేవారు నాన్న. నేను సంతోషంగా చప్పట్లు కొట్టేదాన్ని. మా అన్నయ్య గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తనకు నేనంటే ప్రాణం. స్కూల్‌కు వెళ్తున్నప్పుడూ
వస్తున్నప్పుడూ నా స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్.. అన్నీ తానే మోసేవాడు. నాకు కోపం వస్తే.. చిట్టి చేతులతో కొట్టేదాన్ని కూడా.
గగన సఖి..
నిజానికి, నేను ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నా. అంతలోనే, కథ నచ్చేసి ఓ టీవీ సీరియల్‌కు సంతకం పెట్టాను. మొదట్లో నాన్న వ్యతిరేకించారు. ఇప్పుడు తనే ప్రోత్సహిస్తున్నారు. మంచి ప్రాజెక్టులు ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. సినిమాల్లోనూ ప్రయత్నించమని చెబుతున్నారు. ఇప్పటికే ఐదు కన్నడ చిత్రాల్లో నటించాను. తాజా చిత్రం ‘బ్రహ్మరాక్షస’ త్వరలో విడుదల కానుంది. మంచి పాత్ర వస్తే తెలుగులోనూ చేస్తాను. టాలీవుడ్లో గొప్ప నటులు ఉన్నారు. వాళ్లతో పనిచేయాలని ఉంది. నేను నటిస్తున్న సీరియల్లోనే అమృత అనే అమ్మాయి కూడా చేస్తున్నది. ఓసారి, తనతోపాటు వాళ్ల బాబాయి కూతురు సెట్స్‌కు వచ్చింది. నాకోసం చాక్లెట్లు తెచ్చింది. ఎంత సంతోషంగా అనిపించిందో! ఇలాంటి అభిమానులు చాలామందే ఉన్నారు. వాళ్లకు ఎంతో రుణపడి ఉంటాను.
…? హరిణి
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

