కార్తికేయ మొండి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో కార్తికేయ. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా కూడా ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే అప్పటి నుంచి వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘గుణ 369’, ‘హిప్పీ’,’ 90 ml’ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు కార్తికేయ. ఇలాంటి సమయంలో ఆయనకు గీతా ఆర్ట్స్ నుంచి ‘చావు కబురు చల్లగా’ సినిమా వచ్చింది. ఈ సినిమా తాజాగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో విషయం కంటే చావుపుట్టుకల వేదాంతం ఎక్కువైపోయింది అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే చాలా మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు కార్తికేయ. హీరోగా అవకాశాలు వస్తున్నప్పుడు విలన్‌గా నటించడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. కానీ కార్తికేయ మాత్రం కేవలం హీరోగానే కాకుండా ప్రతినాయక పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కరుడుగట్టిన విలన్‌గా మెప్పించాడు. సినిమా ఫ్లాప్ అయినా కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ క్రమంలోనే అజిత్ హీరోగా వస్తున్న ‘వాలిమై’ సినిమాలో కూడా కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ కుర్ర నటుడు. ఇందులో ఆయన విలన్‌గా నటించడానికి కారణం హీరో అజిత్ కావడం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా.. అందుకే కథ చెప్పగానే ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్నా అంటున్నాడు కార్తికేయ. కార్తీతో ఖాకీ లాంటి సినిమా చేసిన వినోద్ ఈ సినిమాకు దర్శకుడు. ఏదేమైనా హీరోగా నటిస్తున్నప్పుడు విలన్‌గా చేయడానికి చాలా ధైర్యం కావాలి.. అది చేస్తున్నాడు కార్తికేయ.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

