7 నుంచి 19 వరకు టీడీ టీకా
ధనుర్వాతం, కంఠసర్ఫ (డిప్తీరియా) వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు ఈ నెల 7 నుంచి 19 వరకు టీడీ (టెటనస్ అండ్ డిప్తీరియా) టీకా ఇవ్వనున్నట్లు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.
మెదక్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ధనుర్వాతం, కంఠసర్ఫ (డిప్తీరియా) వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు ఈ నెల 7 నుంచి 19 వరకు టీడీ (టెటనస్ అండ్ డిప్తీరియా) టీకా ఇవ్వనున్నట్లు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ధనుర్వాతం రాకుండా గతంలో టెటనస్ టీకా ఇచ్చేవారని కానీ, డిప్తీరియాతో పిల్లలు బాధపడుచున్నారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నుంచి టెటనస్ స్థానంలో టీడీ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారన్నారు. కరోనా వల్ల రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు పూర్తిస్థాయిలో టీకా ఇవ్వలేకపోయినందున ఈ నెల 7 నుంచి 19 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా టాస్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 50 శాతం టీడీ టీకాలు ఇచ్చామని, మిగతా 50 శాతం మందికి టీకాలు ఇచ్చేందుకు పాఠశాలలను వేదికగా చేసుకొని ఈ ప్రత్యేక ఉద్యమంగా చేపట్టామన్నారు.
పాఠశాలలో చదువుతున్న 10, 16 సంవత్సరాల వయసున్న విద్యార్థులు 5, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థులకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. బడిబయట ఉన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 25,423 మంది ఈ వయస్సు వారు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 10 ఏండ్ల వయస్సు వారు 14,218 మంది, 16 ఏండ్ల వయస్సు గలవారు 10,955, బడిబయట ఉన్నవారు 250 మంది ఉన్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఏఎన్ఎం రోజుకు 250 డోసు టీకాలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకొని వంద శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు.
పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని 5, 10వ తరగతి పిల్లలందరికీ టీడీ టీకా తీసుకునేలా అవగాహన కలిగించాలని, టీకా ఇచ్చేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని, పాఠశాలలో అందరికీ టీకా ఇచ్చినట్లు ధ్రువపత్రాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఐసీడీఎస్ అధికారులు, విద్యాశాఖ సమన్వయంతో పనిచేస్తూ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కోరారు. టీకా వేసుకునేలా అవగాహన కలిగించవలసినదిగా జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, డీఆర్డీవో అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయ నిర్మల, డీఈవో రమేశ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మాధురి, మాస్ మీడియా అధికారి రమ, డాక్టర్ నవీన్, జిల్లా మైనార్టీ అధికారి జెంలా నాయక్, జిల్లా మహిళా సంక్షేమాధికారి పద్మ, డీపీఆర్వో శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

