Students Protest | గణితం అధ్యాపకురాలు కోసం చేగుంటలో రోడ్డెక్కిన విద్యార్థినులు
Students Protest | ఆరు నెలలుగా గణితం( Mathematics teacher) అధ్యాపకురాలు రావడం లేదని దీంతో చదువులో వెనుకబడుతున్నామని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎస్టీ గిరిజన స్పోర్ట్స్ గురుకుల కళాశాల విద్యార్థినులు సోమవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
చేగుంట : ఆరు నెలలుగా గణితం( Mathematics teacher) అధ్యాపకురాలు రావడం లేదని దీంతో చదువులో వెనుకబడుతున్నామని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎస్టీ( ST) గిరిజన స్పోర్ట్స్ గురుకుల కళాశాల విద్యార్థినులు సోమవారం రోడ్డుపై బైటాయించి నిరసన (Students Protest ) తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరంలో 33 మంది, రెండవ సంవత్సరంలో 29 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతున్నారని విద్యార్థినిలు వివరించారు.
రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా లెక్చరర్ లేక గణితం బోధించడం లేదన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలకు గణిత అధ్యాపకురాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ సుమతి వివరణ ఇచ్చారు. నాలుగు నెలల క్రితం చేగుంటలో పనిచేసిన గణితము అధ్యాపకురాలు భద్రాచలం గురుకుల పాఠశాలకు బదిలీపై వెళ్లిందని అప్పటి నుంచి గణితం అధ్యాపకులు పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కొండ మల్లయ్యపల్లి నుంచి బదిలీపై వచ్చి గణిత ఉపాధ్యాయులు జాయినింగ్ అవుతున్నట్లు ప్రిన్సిపల్ సుమతి తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

