సర్ (ఎస్ఐఆర్) ఫారం.. ఇలా నింపండి
ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉండే ఎన్యుమరేషన్ ఫారం అందజేస్తారు.
- ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పులు లేకుండా నింపాలి
- ఫామ్ అందజేసిన తర్వాత రసీదు తప్పనిసరి
- ఓటర్లు చేయాల్సిన, చేయకూడని నిబంధనలు వివరించిన అధికారులు
- ఫారంలో కొత్త కలర్ ఫొటో అతికించాలి
బొల్లారం, జూలై 5: ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసేందుకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉండే ఎన్యుమరేషన్ ఫారం అందజేస్తారు. సరైన సమాచారం అందిస్తేనే మీ పేరు ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. ఈ ఫారం ఎలా నింపాలో తెలియక చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ ఫారాన్ని ఎలా నింపాలో అధికారులు సూచిస్తున్నారు.
ఎన్యుమరేషన్ ఫారం ఇలా..
ఓటర్ జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలు సేకరించేందుకు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకునేందుకు ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఈ ఫారంలో వివరాలు నింపేటప్పుడు తప్పులు లేకుండా స్పష్టంగా రాయాలి.
ఫారంలో పొందుపరిచిన విభాగాలు…. 01-01-2002 నాటికి ఓటు ఉంటే..
2002 ఓటర్ జాబితా వివరాల ఆధారంగా ఈ కాలాన్ని నింపాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, సంరక్షకుడి పేరు, అతనితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటర్ జాబితాలో గల శాసనసభా నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ స్టేషను నెంబరు (భాగం సంఖ్య), క్రమసంఖ్య (ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబరు) ఎంత అనేది వేయాలి.
01-01-2002 నాటికి ఓటు లేకపోతే..
మీకు ఓటు లేదు.. 2002 ఓటర్ జాబితాలో మీ తండ్రి, తల్లి, తాతయ్య, నానమ్మలలో ఎవరికి ఓటు ఉందో వారి వివరాల ప్రకారం ఈ బాక్స్ పూరించాలి. పేరు అనే చోట తండ్రి, తల్లి, తాతయ్య, నానమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ వేయాలి. బంధువు అనే చోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబి శాసనసభా నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నెంబర్ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ ఎం ఈ అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కానీ మీ బంధువుల్లో ఓటు ఉన్న వారి వివరాలు ఈ బాక్సులో నింపాలి.
ఫారంపై భాగం..
మీ పేరు. మీ ఓటర్ ఫొటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి. అకడే పకన మీ లేటెస్ట్ ఫొటో తప్పనిసరిగా అతికించాలి.
మొదటి భాగంలో..
2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేని వారికోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకొని నింపాలి.
మరో భాగం..
చివరి భాగంలో ఓటరు ప్రస్తుత వివరాలను నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి వాటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి అయితే మీ భాగ స్వామి పేరు వారి ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, పెళ్లి కాకుంటే ఆ బాక్సులు ఖాళీగా వదిలేయాలి.
అందించాల్సిన పత్రాలు ఇవే..
ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, 10వ తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. సరైన వివరాల అందించడం వల్ల భవిష్యత్తులో ఓటర్ కార్డు గల్లంతు కాకుండా ఉంటుంది. ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.
ముఖ్యంగా చేయాల్సినవి…
- ప్రతి కాలమ్‌ను జాగ్రత్తగా చదివి నింపాలి.
- పేరు స్పెల్లింగ్ లేకుండా అన్ని పత్రాల్లో ఒకేలా ఉండేలా చూసుకోండి.
- పుట్టిన తేదీ అన్ని పత్రాలకు సరిపోతుందో లేదో నిర్ధారించుకోవాలి.
- ఫారం సమర్పించిన తర్వాత రసీదు లేదా అంగీకార పత్రం తీసుకోవాలి.
- సందేహాలు ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించాలి.
- మొబైల్ నెంబరు, చిరునామా వంటి వివరాలు లేటెస్ట్ ఇవ్వాలి. చేయకూడనివి…
- తప్పుడు సమాచారం ఇవ్వకూడదు.
- ఫారం నింపకుండా ఖాళీగా వదిలేయకూడదు.
- ఇతరుల పత్రాలు ఉపయోగించకూడదు.
- పత్రాలపై మార్పులు చేసి సమర్పించకూడదు.
- తొందరపాటుతో చదవకుండా సంతకం చేయరాదు.
- ఒకే వ్యక్తికి సంబంధించిన విభిన్న వివరాలు ఇవ్వకూడదు.
- ఫారం నింపేటప్పుడు గుర్తుంచుకొనే ముఖ్యమైన అంశాలు
వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయస్సు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి.
చిరునామ ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నెంబరు, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేరొనాలి.
ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్ సరిపోల్చడానికి అవసరమైన వివరాలు అందించాలి.
ఫొటో, సంతకం: ఫామ్ చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మరిచిపోవద్దు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

