ర్యాగింగ్ నేరం
విద్యాసంస్థల్లో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థు లు ర్యాగింగ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే కఠినంగా శిక్షిస్తామని, ర్యాగిం గ్ చట్టరీత్యా నేరమని ఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు.
- సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురిచేయొద్దు
- హద్దులు దాటితే చట్టరీత్యా చర్యలు
- షీటీమ్, డయల్100కు సమాచారమివ్వాలి
- సరదాలకు పోయి కష్టాలు కొనితెచ్చుకోవద్దు
- సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
- మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు
సంగారెడ్డి, జూలై 11 : విద్యాసంస్థల్లో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థు లు ర్యాగింగ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే కఠినంగా శిక్షిస్తామని, ర్యాగిం గ్ చట్టరీత్యా నేరమని ఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ‘మెడికల్ కళాశాలల్లో ర్యాగింగ్’పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రభుత్వ చట్టాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ర్యాగింగ్ నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి సమాచారాన్ని నిర్భయంగా షీటీం(8712656772)లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థు లు మొదటగా చదువుకోడానికి వస్తున్నామనే విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు. సరదాలకు వెళ్లి కష్టాలను కొని తెచ్చుకొవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచిం చారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలబడొద్దన్నారు. సదస్సులో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రభాకర్, సుధామాధురి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్, డీఎస్పీ రవీంద్రారెడ్డి, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

