రాయపోల్ అక్టోబర్ 04 : రాష్ట్రంలో ప్రజా పాలన ప్రజలకు వ్యతిరేకంగా మారిందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వుగారి యాదవరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సర్వు యాదవరెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలి వేయడం వలన పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు నింపి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదని. ఇందులో భాగంగానే రైతు భరోసా సకాలంలో వేయడం లేదని. రైతు భీమా పథకం గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజా పాలన పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని. మళ్లీ తెలంగాణ ఇచ్చిన కెసిఆర్ సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ. జెడ్పిటిసి ఎన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతుతో గెలుపొందడం ఖాయామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.