Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Harish Rao | పక్క రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించాయి.. కానీ ఇంతవరకు మన తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
Harish Rao | రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కరువు పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని మేం గతంలో కూడా చాలాసార్లు చెప్పామన్నారు.. ..10 నెలల క్రితమే ఎల్‌నినో వస్తుందని కరువు పరిస్థితులు ఏర్పడుతాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వాలను హెచ్చరించారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. పత్తి లాంటి పంట కనీసం దిగుబడి కాదు.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
పత్తి దిగుబడి బాగా తగ్గిపోయి ఎకరాకు 2-3 క్వింటాళ్లు కూడా రానట్వంటి పరిస్థితి ఉన్నది. పత్తి దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు హరీశ్ రావు.. 10-12 లక్షల ఎకరాల్లో పంటలు బాగా ఎండిపోతున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో ప్రజలు తాగునీటికి, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. పక్క రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించాయి. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించి రైతాంగానికి అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తున్నారు.. కానీ ఇంతవరకు మన తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు.. తక్షణ ఆర్థిక సాయం ప్రకటించలేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో ఫెయిల్ అయిపోయారన్నారు. ఇయ్యాళ్ల కొందామంటే కరెంట్ లేదని రేవంత్ రెడ్డి బీద అరుపులు మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
LIVE: గజ్వేల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం https://t.co/tJMGQLthcv
— BRS Party (@BRSparty) October 22, 2026
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

