Tujalpur | తుజాల్పూర్లో పడకేసిన పారిశుద్ధ్యం.. డీజిల్‌కు కూడా డబ్బులు లేక మూలనపడ్డ ట్రాక్టర్
Tujalpur | నర్సాపూర్, మే15: పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్‌కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం ఎక్కడపడితే అక్కడ పడకేసింది.
Tujalpur | నర్సాపూర్, మే15: పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్‌కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం ఎక్కడపడితే అక్కడ పడకేసింది. వివరాల్లోకి వెళ్లితే మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామంలో పారిశుద్ధ్య లోపం కండ్లకు కట్టినట్లు కనపడుతుంది. మురికి కాలువలలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం చేరింది. దీంతో దోమల, ఈగల బెడద పెరిగి ప్రజారోగ్యానికి సమస్యగా మారే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీ ట్రాక్టర్లో డీజీల్ పోయడానికి డబ్బులు లేక ట్రాక్టర్ మూలనపడేశారు. గ్రామంలో జరిగే వివాహ శుభకార్యాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్యాంకర్‌కు రూ.200 సేకరిస్తూ డీజీల్ పోస్తూ చెత్తాచెదారాన్ని తొలగించే దయనీయ పరిస్థితికి చేరుకుంది.
ఇక గ్రామపంచాయతీ పరిధిలోని అర్జుతాండా, వాల్యాతాండా, వసురాంతాండాలలో ట్రాక్టర్ జాడ లేక తాండావాసులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికే ట్రాక్టర్ డీజీల్ కొరకు పెట్రోల్ బంకులలో సుమారు రూ.50 వేలు ఉద్దెర పెట్టడం జరిగింది. ఈ డబ్బులు కడితే గాని డీజీల్ పోయమని బంకు సిబ్బంది తెగేసి చెప్పారని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- medak
- sanitization
- tujalpur
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

