రేపటి నుంచి లక్ష బిల్వార్చన
- పూజలందుకోనున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి
- నిత్యం సామూహిక రుద్రాభిషేకాలు, సత్యనారాయనవ్రతాలు

గుమ్మడిదల : జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాసంలో లక్షభిల్వార్చన, ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మండలంలోని వీరన్నగూడెంలో కొలువైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో శశిధర్‌గుప్తా తెలిపారు.
సోమవారం నుంచి వచ్చే నెల 7వతేదీ వరకు వేదమంత్రోచ్ఛరణలతో లక్షబిల్వార్చన, రుద్రాభిషేకాలు, వీరభద్రప్రాస్తాయాలు, సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణమాసం సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో మొదటి రోజు ఉదయం 6గంటలకు బిందెతీర్థం, అనంతరం లింగాభిషేకాలను నిర్వహించనున్నారు. 7గంటల నుంచి 12 గంటల వరకు భక్తులతో పూజా కార్యక్రమాలను ఉంటాయన్నారు. 12గంటల నుంచి 1గంట వరకు అన్నపూజ భక్తులచే జరపనున్నారు.

2 గంటల వరకు గణపతి పూజ, రుత్వికరణ, లక్షపత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు నిత్యకల్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవో శశిధర్‌గుప్తా తెలిపారు. ఆలయాని వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కు తప్పని సరిగా ధరంచాలి లేని యేడల ఆలయ ప్రవేశానికి లేదని ఈవో స్పష్టం చేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

