పేదలకు ఆసరాగా సీఎం సహాయనిధి : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి | సీఎం సహాయనిధి కష్ట కాలంలో పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు.

నారాయణఖేడ్, సెప్టెంబర్ 27 : సీఎం సహాయనిధి కష్ట కాలంలో పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 13 మందికి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.
సీఎం సహాయనిధి ద్వారా నియోజకవర్గంలోని వేలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందికి ఎల్వోసీలను జారీ చేసి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడాదనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

