Balagam movie | సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్కు పల్లె జనం ఫిదా.. బంధాలను తట్టి లేపుతున్న తెలంగాణ సినిమా
బలం.. బలగం.. మన కుటుంబం అనేది ఆ సినిమా చిత్రకథ.. బలమైన రక్త సంబంధాలను, బంధాలను కాదనుకుని లేని పంతాలు, పట్టింపులతో ఏళ్లకు ఏండ్లు మాట్లాడుకోని వారికి మెలుకోలుపు ఈ బలగం సినిమా. ఒక కుటుంబంలో కొడుకు, అల్లుడు మధ్య పంతం, పట్టింపుతో తండ్రి, కూతురు రెండు దశాబ్దాలు పడిన మనోవేదనకు దృశ్యరూపం ఈ సినిమా. కుటుంబ పెద్దాయన చనిపోయిన తర్వాత 11రోజులు పిండం కాకి ముట్టకపోవడం అనే సమస్య ఆ కుటుంబాన్ని ఎలా ఏకం చేసిందనేది తెరమీద చూస్తూనే అర్థం అవుతుంది.
- ప్రతి ‘బలగం’ భావోద్వేగానికి గురవుతున్న వైనం
- పంచాయతీల్లో ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్న పాలకవర్గాలు
- సినిమా చూసి కన్నీటి పర్యంతమవుతున్న ప్రజలు
- చిన్న సినిమాతో బలోపేతమవుతున్న బంధాలు
Balagam movie | పటాన్చెరు, ఏప్రిల్ 16 : బలం.. బలగం.. మన కుటుంబం అనేది ఆ సినిమా చిత్రకథ.. బలమైన రక్త సంబంధాలను, బంధాలను కాదనుకుని లేని పంతాలు, పట్టింపులతో ఏళ్లకు ఏండ్లు మాట్లాడుకోని వారికి మెలుకోలుపు ఈ బలగం సినిమా. ఒక కుటుంబంలో కొడుకు, అల్లుడు మధ్య పంతం, పట్టింపుతో తండ్రి, కూతురు రెండు దశాబ్దాలు పడిన మనోవేదనకు దృశ్యరూపం ఈ సినిమా. కుటుంబ పెద్దాయన చనిపోయిన తర్వాత 11రోజులు పిండం కాకి ముట్టకపోవడం అనే సమస్య ఆ కుటుంబాన్ని ఎలా ఏకం చేసిందనేది తెరమీద చూస్తూనే అర్థం అవుతుంది. అచ్చ తెలంగాణ భాష, యాస, ప్రాంతాలు, కథతో వచ్చిన బలగం సినిమాకు ఇప్పుడు జననీరాజనాలు అందుతున్నాయి.
థియేటర్లలో గొప్ప హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేక షోలు వేసి చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల ఆసక్తిని చూసిన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ యువజన సంఘాలు బలగం సినిమాను పంచాయతీల ఆవరణలో, స్కూల్ ఆవరణల్లో వేసి ఉచితంగా చూపిస్తున్నారు. చాలా ఏండ్ల తర్వాత ఊరంతా కలిసి ఒక కుటుంబంలా సినిమాను చూడడం పూర్వకాలాన్ని గుర్తుకు తెస్తున్నది. నాలుగు దశాబ్దాల క్రితం 16ఎంఎం సినిమాలు గ్రామాల్లో చిన్న తెరవేసి ప్రదర్శించేవారు. ఇప్పుడు అలాగే ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి పెద్ద స్పీకర్లు ఏర్పాటు చేసి ఈ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు బలగం సినిమాను ఆరు బయట వందలాది మంది కలిసి చూస్తున్నారు.
థియేటర్లు ఉన్నా, ఇండ్లలో పెద్ద టీవీలు ఉన్నా, ఊరి జనం మధ్య ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బలగం సినిమాను సరదాగా చూస్తున్నా, చివర్లో బం ధాలు, అనుబంధాలు, పట్టింపులు, కుటుంబ పెద్దల మనసులో ఉన్న అసలైన విషయాలు తెరపైకి వచ్చి గుండెలను పిండేస్తున్నాయి. బరువైన సన్నివేశాలు, అంతకన్నా ఉత్కంఠ కలిగించే కాకి పిండం ముట్టకపోవడం అనే అంశం సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చేసింది. బయట తెరలపై సినిమాను మొదట ప్రదర్శించడంపై సినిమా యూనిట్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సినిమా తెలంగాణ ప్రజల ఎమోషన్స్‌తో ముడిపడి ఉండడంతో ఎక్కడ ప్రదర్శించుకున్నా అభ్యంతరం లేదనడంతో ఇప్పుడు ఈ సినిమాను చూసేందుకు అంతటా ఏర్పాట్లు జర్యుగుతున్నాయి.

కన్నీళ్లు పెట్టిస్తున్న సన్నివేశాలు..
అచ్చ తెలంగాణ భాషలో, సంభాషణలతో అత్యంత సహజంగా చిత్రించిన ఈ చిత్రం ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెను తడిమేస్తున్నది. మనదైన సినిమా, మన సినిమాగా ప్రజలు భావిస్తున్నారు. ఇంతకాలం చూసిన రొటీన్ తెలుగు సినిమా హీరోయిజం లేదు. డ్యాన్స్‌లు లేవు, గాలిలో పల్టీలు కొట్టి తన్నే సన్నివేశాలు లేవు. చనిపోయిన తాత పిండం కాకి ముట్టుకపోవడం అనే సాధారణ అంశమే సినిమాగా వచ్చింది. చావు అంటేనే భయపడే ప్రజలకు ఇప్పుడు ఆ చావు కేంద్రంగా వచ్చిన సినిమా ఆకట్టుకుంటుండడం విశేషం. ఈ సినిమాలో పంతం, పట్టింపులకు పోయిన బావ, బామ్మర్దుల మధ్య నలిగిపోయిన తండ్రి, కూతుర్ల పాత్ర కీలకం. చనిపోయిన తండ్రి మనసులో ఏముందో అది తెలుసుకుని తీరిస్తేనే కాకి పిండం ముడుతుందని తేలడంతో సినిమా ఉత్కంఠకు గురిచేస్తుంది.
తండ్రి మనసులో ఏముందో అర్థం కాక బిడ్డలు, మనవడు, గ్రామస్తులు పడే ఆవేదన సినిమాను రక్తి కట్టిస్తుంది. చివరికి బుడగజంగాల కళాకారులు పాడిన పాట విషయాన్ని విశదీకరిస్తుంది. పాట కొనసాగుతున్నంత సేపట్లోనే ఆస్తిలో వాటా కోసం పంతం పట్టిన చిన్న తమ్ముడు అన్న కాళ్లపై పడి ప్రాధేయపడడం, చెల్ల్లెలు, సోదరుల ప్రేమను గుర్తించిన బావ వారి వద్దకు వచ్చి కలిసిపోవడం, అంతవరకు అల్లరిచిల్లరగా తిరిగిన మనవడు తాత కోసం కన్నీరు కార్చ డం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలను తడి చేసేలా ఉన్నాయి. మహిళలు, వృద్ధులు అయితే చివరి సన్నివేశాలకు కన్నీరు కారుస్తున్నారు. కుటుంబ సభ్యులను పట్టుకుని ఏడుస్తున్నారు. ఆస్తుల కోసం, స్వార్థం కోసం కుటుంబ బంధాలకు దూరంగా ఉండడం ఎంత పెద్ద తప్పో గ్రహించి ఒకరికొకరు క్షమాపణలు సైతం చెప్పుకోవడం కనిపిస్తున్నది.
మనకు అసలైన బలం, బలగం మన కుటుంబం అనేది చివరిగా అర్థం అయ్యేలా దర్శకుడు వేణు సినిమాలో ముగింపు ఇచ్చాడు. ఈ సినిమా తెలంగాణ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్‌గా అనుకోవచ్చు. గ్రామాల్లో ఇప్పుడు బలగం సినిమానే చర్చగా మారింది. ప్రజల్లో ఈ మేర భావోద్వేగాలను కలిగించిన సినిమాలు అరుదుగానే వస్తాయనుకోవచ్చు. ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో ఈ సినిమా పలు గ్రామాల్లో ప్రదర్శితమయ్యింది. పటాన్చెరు, జిన్నారం మండలాల్లో పంచాయతీల ముందే బలగం సినిమాను వేశారు. ఘనపూర్, కర్ధనూర్, నందిగామ గ్రామాల్లో సినిమాను ఎల్ఈడీ తెరపై గ్రామనడిబొడ్డున ప్రదర్శించారు. పాశమైలారం జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో సినిమాను ప్రదర్శించారు. జిన్నారం మండల కేంద్రంలోనూ బలగం సినిమాను ప్రదర్శించారు.
అసలైన తెలంగాణ చిత్రం ఇది..
బలగం సినిమాలో తెలంగాణ కుటుంబాలు ఎలా ఉండాలో చూపించారు. గతంలో ఉన్న పద్ధతులు, పెద్దరికాలను కాదనుకుని చాలా మంది పంతాలతో, ఆస్తి తగాదాలతో దూరమయ్యారు. మన అసలైన బలం, బలగం కుటుంబాలే అని గుర్తించాల్సిన అవసరం ఈ సినిమా గుర్తు చేసింది. మా ఊరి ప్రజలు సినిమా చూసి నిజాలు గ్రహించారు. కొందరు కన్నీరు కార్చారు. ఇన్నాళ్లకు తెలంగాణ సెంటిమెంట్స్‌తో గొప్ప చిత్రం వచ్చింది. తెలుగు సినిమా పేరున మనకు ఫైట్లు, పిచ్చి గెంతులను ఇన్నాళ్లు చూపించారు. ఇప్పుడు అసలు సిసలైన తెలంగాణ సినిమాను దర్శకుడు వేణు, నిర్మాత దిల్‌రాజు కుటుంబం తీసింది. ఇలా అనుబంధాలను కలిపే మంచి సినిమాలు ఇంకా తెలంగాణలో రావాలని కోరుకుంటున్నా.
-వడ్డే కుమార్, ఉప సర్పంచ్, కర్ధనూర్
కుటుంబాలను కలిపే సినిమా ఇది…
బలగం సినిమా బాగుందని చూసిన వారందరూ చెప్పడంతో మా గ్రామంలో వేయాలని నిర్ణయించాం. సాయంత్రం సమయంలో ఎల్ఈడీ తెరలపై సినిమాను ప్రదర్శించాం. చెప్పేదానికన్నా చూస్తేనే సినిమా బాగుంటుంది. ప్రతి ఇంట్లో వచ్చే సమస్యలనే ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. పంతాలకు పోయి ఏండ్లకు ఏండ్లు మాట్లాడకుండాఉన్నవారు కూడా ఈ సినిమా చూసి తిరిగి మాట్లాడుకుంటున్నారు. గ్రామస్తులు కూడా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కలిసిమెలిసి ఉం టేనే బలం, బలగం అని చూపడంతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. చనిపోయాక పట్టుకుని పోయేదేమీ లేదని అర్థమయ్యేలా సినిమా ఉంది. మా గ్రామస్తులు మంచి సినిమా చూపించారని మమ్మల్ని అభినందిస్తున్నారు. ప్రజలు కోరినందుకు ఈ సినిమాను ప్రదర్శించాం. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది.
-కావ్యాకాశిరెడ్డి, సర్పంచ్, ఘనపూర్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

