నామమాత్రంగా రైతు సదస్సులు
రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు.
- రైతులకు సమాచారం ఇవ్వకుండానే సదస్సులు
- పరిచయం ఉన్న దగ్గరి వారిని పిలిపించుకున్న అధికారులు
- దుబ్బాక సదస్సులో పదిమంది కూడా పాల్గొనని రైతులు
- వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది కనిపించేలా రైతులతో కలిసి కూర్చున్న ఏఈవోలు
దుబ్బాక, జూన్ 25: రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే రైతు వేదికలో రైతు సదస్సు నిర్వహించడంపై పలువురు రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. దుబ్బాకలో రైతువేదికలో నిర్వహించిన అభిప్రాయాల సేకరణ కార్య్రమానికి రైతులు లేకుండాపోయారు. తమకు పరిచయం ఉన్న పదిమంది రైతులను బలవంతంగా పిలిపించుకుని రైతు అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. రైతు అభిప్రాయ సేకరణ కార్యక్రమంపై రైతులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.
పదిమందిలోపే రైతులు
దుబ్బాక రైతువేదికలో నిర్వహించిన సదస్సులో కేవలం పదిమంది లోపే రైతులు పాల్గొనటం గమనార్హం. డివిజన్ పరిధిలోని వేలమంది రైతులున్నప్పటికీ పట్టుమని పదిమంది రైతులు కూడా సదస్సులో పాల్గొనకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. వచ్చిన రైతులను వ్యవసాయాధికారులు తమ వెంట తీసుకొచ్చినవారే కావడం విశేషం. వీడియో కాన్ఫరెన్స్లో రైతు లు చాలామంది ఉన్నట్లు కనిపించేందుకు ఏఈవోలు వారితో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. దుబ్బాక ఏడీ పరిధిలోని ఏఈవోల కంటే రైతులు తక్కువగా హాజరయ్యారు. వచ్చిన రైతుల నుంచి రైతు భరోసా, తదితర వాటిపై నామమాత్రంగా కాగితాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. 5 ఎకరాల లోపున్న రైతులకే రైతు బంధు ఇవ్వాలని వచ్చిన రైతుల తరుఫున అభిప్రాయాలను తీసుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

