నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం జరుగనున్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తుండడంతో ఈ ప్రాంతంలోని పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- చేర్యాల సబ్ డివిజన్ పరిధిలో 4,679 మంది ఓటర్లు
- నాలుగు మండలాల్లో 4 పోలింగ్ కేంద్రాలు
- ఉదయం 8 నుంచి 4గంటల వరకు పోలింగ్
- ముగిసిన ప్రచారం, కేంద్రాల వద్ద 144 సెక్షన్
చేర్యాల, మే 26: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం జరుగనున్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తుండడంతో ఈ ప్రాంతంలోని పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఉపఎన్నిక ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4వరకు కొనసాగనున్నది. గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసేందుకు చేర్యాల మండల ప్రజాపరిషత్ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్టలో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చేర్యాలలో 2,555 గ్రాడ్యుయేట్స్ ఓటర్లలో(1686 మంది పురుషులు, 869 మహిళలు), కొమురవెల్లిలో 678 ఓటర్లలో (447 మంది పురుషులు, 231 మంది మహిళలు), మద్దూరులో 935 మంది ఓటర్లలో (642 మంది పురుషులు, 293 మంది మహిళలు), ధూళిమిట్టలో 511 మంది ఓటర్లలో (346 మంది పురుషులు, 165 మంది మహిళ ఓటరు)్ల ఉన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరీలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్‌కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ పేపర్లో తమ అభ్యర్థులకు ప్రాధాన్యతను నెంబర్ల రూపంలో వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ రెండు రోజుల క్రితం ఉప ఎన్నిక ఏర్పాట్లపై సిద్దిపేట జిల్లా కలెక్టర్, సీపీలతోపాటు హుస్నాబాద్ ఏసీసీ, చేర్యాల సీఐలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నాలుగు మండలాల పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 8 నుంచి 4గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కాకుండా పార్టీల నాయకులు గుంపులుగా కేంద్రాల వద్ద ఉండవద్దన్నారు. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రం జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను పోలీస్‌శాఖ ఏర్పాటు చేసింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

