యువకుల సాహసం.. నిలిచిన యువతి ప్రాణం
పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగపడ్డాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ప్రేమోన్మాదిని పట్టుకొని కర్రలతో చితకబాధి యువతిని కాపాడారు.
- బోరబండ బంజారానగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం
- స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి..
- కళ్లల్లో కారం చల్లి.. కత్తితో గొంతు కోసే యత్నం
- అప్రమత్తమై అడ్డుకున్న ఆటోడ్రైవర్, స్థానికులు
- ప్రేమోన్మాదిని కర్రలతో చితకబాది, కత్తి లాక్కొని.. యువతి ప్రాణాలు కాపాడి దవాఖానకు తరలింపు
- గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
- పోలీసుల అదుపులో నిందితుడు
వెంగళరావునగర్, ఏప్రిల్ 24: పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగపడ్డాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ప్రేమోన్మాదిని పట్టుకొని కర్రలతో చితకబాధి యువతిని కాపాడారు. తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సోమవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ బంజారానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ సైదులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రామారావునగర్‌కు చెందిన సిద్ధప్ప, శాంతమ్మల కూతురు లక్ష్మి(25), ప్రస్తుతం బోరబండ మోతీనగర్‌లోని పీఆర్‌నగర్‌లో ఉంటున్న కిశోర్(28)లకు గత 7 సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. గతంలో బోరబండలో కిశోర్ పాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించేవాడు. అప్పుడు అతడి వద్ద లక్ష్మి పనిచేసేది. ప్రస్తుతం మోతీనగర్‌లోని తన మామయ్యకు చెందిన పాస్ట్‌ఫుడ్ సెంటర్లో కిశోర్ పనిచేస్తుండగా, లక్ష్మి మాదాపూర్‌లోని నోవాటెల్‌లో హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తుంది.
కిందపడిపోయిన తల్లీకూతురు
ఏడు సంవత్సరాలుగా కిశోర్ ప్రేమిస్తున్నానంటూ లక్ష్మి వెంట పడేవాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ వస్తున్నది. అయితే ఇటీవల లక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కస్సుతో పగ పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో లక్ష్మి ఆమె తల్లి శాంతమ్మను తీసుకొని స్కూటిపై వెళ్తుండగా ముందస్తుగా పథకం ప్రకారం కాపుకాసిన కిశోర్ బైక్‌తో వెంబడించాడు. బంజారానగర్ మెయిన్ రోడ్డుకు చేరుకోగానే లక్ష్మి స్కూటీకి తన బైక్‌ను అడ్డుపెట్టి ఆపాడు. కిందకు దిగిన కిశోర్ లక్ష్మి కళ్లల్లో కారం చల్లడంతో లక్ష్మి, ఆమె తల్లి శాంతమ్మ కిందపడిపోయారు. వెంటనే కత్తితో లక్ష్మి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. లక్ష్మికి హెల్మెట్ ఉండటంతో పాటు ఆమె కిశోర్ భారీనుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది.

Medak12
అడ్డుకున్న ఆటోడ్రైవర్,స్థానికులు
యువతిపై దాడిని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. ఓ ఆటో డ్రైవర్‌తో పాటు మరి కొంతమంది స్థానికులు కిశోర్‌ను అడ్డుకున్నారు. పట్టుకొని కర్రలతో దేహశుద్ధి చేశారు. అప్పటికే లక్ష్మి గొంతు కొంత వరకు తెగింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మోతీనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడు కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
“అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఓ ప్రేమోన్మాది బరితెగించాడు. స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించి కళ్లల్లో కారం చల్లాడు. కిందపడిపోయిన యువతిని కత్తితో గొంతుకోసి చంపాలని యత్నించగా ఓ ఆటోడ్రైవర్‌తో పాటు స్థానిక యువకులు రావుజీ నాయక్, శంకర్ నాయక్, మారుతీ, మహ్మద్ ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. అడ్డు వస్తే మిమ్మల్ని సైతం పొడిచి చంపుతానని బెదిరిస్తూ మీదికి వెళ్లినప్పటికీ బెదరకుండా ప్రేమోన్మాది నుంచి యువతిని రక్షించారు. అప్పటికే యువతి గొంతుకు కత్తి కాట్లు పడగా చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని పట్టుకొని కర్రలతో చితకబాధి పోలీసులకు అప్పగించారు. ప్రాణాలను పణంగా పెట్టి యువతిని కాపాడిన యువకులకు స్థానికులు అభినందనలు
తెలిపారు.”
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

