అమీన్పూర్ బల్దియాలో పార్కుల అభివృద్ధి
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధ్దమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీసీ) అధిక ప్రాధాన్యతనిస్తోంది.
- లింగమయ్య పార్కు, తులసీ వనం లేక్, శంభునికుంట లేక్‌ల అభివృద్ధికి హెచ్ఎండీఏ నిధులు
- రూ.3.63 కోట్లతో ల్యాండ్ స్కేపింగ్ పనులు
- చేపట్టనున్న హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం
సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ)/అమీన్పూర్: గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధ్దమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీసీ) అధిక ప్రాధాన్యతనిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న మునిసిపాలిటీలు, ఇతర కార్పొరేషన్లలో అవసరమైన అభివృద్ధి పనుల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు ఆయా పనులను స్వయంగా చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మహానగరం ఎవరూ ఊహించని విధంగా ఔటర్ రింగురోడ్డు దాటి విస్తరిస్తోంది.
ఈ నేపథ్యంలో పట్టణీకరణకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా జీవ వైవిధ్యానికి ప్రాధానిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు చెరువుల సుందరీకరణ, పార్కుల నిర్మాణం వంటి పనులు హెచ్ఎండీఏ చేపడుతోంది. తాజాగా గ్రేటర్ శివారులోని అమీన్పూర్ మునిసిపాలిటీలో 2 చోట్ల ఉన్న చెరువులు, మరో 2 పార్కుల అభివృద్ధికి మొత్తం రూ.3.36 కోట్ల నిధులతో ల్యాండ్ స్కేపింగ్ పనులను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం చేపట్టనున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువుల సరిహద్దులను నిర్ణయించి వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతుండగా, ఆయా చెరువులన్నీ స్థానికులకు ఆహ్లాదకరంగా మార్చేందుకు వాటిని అందమైన పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దనున్నారు. పెద్దమొత్తంలో రకరకాల మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించేలా హెచ్ఎండీఏ కృషిచేస్తోంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

