సిద్దిపేట, జనవరి 10 : సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మధ్యలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
సిద్దిపేట బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే కైట్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, సీనియర్ నాయకులు పాల సాయిరామ్, రామచందర్‌రావు, పట్టణ యువత అధ్యక్షుడు రెడ్డి పభాకర్‌రెడ్డి , విద్యార్థి విభాగం పట్టణ సమన్వయకర్త రమేశ్, యువత నాయకుడు సిద్ధు పాల్గొన్నారు.