సిద్దిపేట అడ్డాగా.. ఎదిగిన బిడ్డ
సీఎం కేసీఆర్‌కు మేధాశక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవారు. పాఠశాల స్థాయిలో చదువు చెప్పిన గురువులు అంటే ఆయన చాలా ప్రేమ, అభిమానం. కేసీఆర్‌కు చిన్నతనంలో తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించారు. సీఎం కేసీఆర్ పదో తరగతి దుబ్బాక ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నారు. విద్యా సంవత్సరం చివరి మూడు, నాలుగు నెలల ముందు ఇక్కడి నుంచి పుల్లూరు హైస్కూల్‌కు వెళ్లి, అక్కడే పదో తరగతి పరీక్షలు రాసి కృతార్థులయ్యారు. చింతమడక నుంచి ప్రతిరోజూ దుబ్బాక వరకు కాలినడకనే వెళ్లేవారు. తర్వాత కొన్ని రోజులకు చింతమడక గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే హిందీ పండితుడు ఇదే పాఠశాలలో పనిచేసేవాడు
- నేడు జాతీయ పార్టీ ప్రకటనచేయనున్న సీఎం కేసీఆర్
- సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభం
- ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన నేత
- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సిద్దిపేటలో చేపట్టిన పనులే స్ఫూర్తి
- ఆది నుంచీ కేసీఆర్‌కు అండగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు
- ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు
- మురిసిపోతున్న పురిటిగడ్డ
చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తి…
సీఎం కేసీఆర్‌కు మేధాశక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవారు. పాఠశాల స్థాయిలో చదువు చెప్పిన గురువులు అంటే ఆయన చాలా ప్రేమ, అభిమానం. కేసీఆర్‌కు చిన్నతనంలో తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించారు. సీఎం కేసీఆర్ పదో తరగతి దుబ్బాక ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నారు. విద్యా సంవత్సరం చివరి మూడు, నాలుగు నెలల ముందు ఇక్కడి నుంచి పుల్లూరు హైస్కూల్‌కు వెళ్లి, అక్కడే పదో తరగతి పరీక్షలు రాసి కృతార్థులయ్యారు. చింతమడక నుంచి ప్రతిరోజూ దుబ్బాక వరకు కాలినడకనే వెళ్లేవారు. తర్వాత కొన్ని రోజులకు చింతమడక గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే హిందీ పండితుడు ఇదే పాఠశాలలో పనిచేసేవాడు. ఆయన దుబ్బాకలోనే నివాసం ఉండటంతో కేసీఆర్, ఆయన సోదరి సుమతి వారి ఇంట్లోనే ఉండేవారు.
పాఠశాలలో సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా పౌరాణిక నాటకాల్లో కూడా కేసీఆర్ పాత్రలు వేసేవారని అతని మిత్రులు చెబుతుంటారు. శ్రీకృష్ణ పాండవీయం నాటకంలో పంచ పాండవుల్లో చివరి వాడైన సహదేవుని పాత్రను కేసీఆర్ పోషించాడని చెబుతారు. పాఠశాల విద్యార్థి సంఘం నాయకత్వానికి జరిగిన పోటీలో కూడా ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ పని చేశారు. ఆయన విద్యార్థి దశలో ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అంకంపేట, మూడో తరగతి చింతమడకలో, నాల్గో తరగతి నుంచి పదో తరగతి వరకు దుబ్బాకలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు సిద్దిపేటలో చదువుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే రాజకీయాల్లో అమితాసక్తి చూపారు. అప్పట్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొని విజయాలు సాధించారు. రాజకీయంగా జన్మనిచ్చిన సిద్దిపేట అంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం. చదువుకున్న కళాశాల అన్నా అమితాసక్తి.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్న సొంతూరు చింతమడక గ్రామస్తులు
ఉద్యమ గడ్డలో చారిత్రాత్మక దీక్షలు..
సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర పన్ని పోలీసుల చేత భగ్నం చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది. ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటలోని దీక్షా శిబిరం వద్ద చరిత్రలో నిలి చిపోయేలా దీక్షలు చేపట్టారు. నంగునూరు మండలం పాలమాకుల వద్ద దీక్షలు కొనసాగాయి. హరీశ్‌రావు ఆధ్వర్యంలో సిద్దిపేట దీక్షా శిబిరం 1531వ రోజుల పాటు కొనసాగింది. దీక్షా స్థలికి ఎంతోమంది మేధావులు, నాయకులు, ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ పలుసార్లు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపి మాట్లాడారు. మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు దీక్షలో కూర్చుని విజయవంతం చేశారు. పాలమాకుల దీక్షా శిబిరం వెయ్యి రోజుల పాటు కొనసాగాయి. ఈ దీక్షలో సుమారుగా 16 వేల మంది మహిళలు కూర్చుని రాష్ట్రం వచ్చేదాకా నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మార్చి 13న సిద్దిపేట దీక్షలు, మార్చి 9న పాలమాకుల దీక్షలను విరమింపజేశారు. సిద్దిపేటలో 1531 రోజుల పాటు దీక్షా స్మృతులకు గుర్తుగా పైలాన్ నిర్మించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- KCR
- political entry
- Siddipet
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

