క్రీడా రాణులకు కేరాఫ్ !
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్‌గా నిలుస్తున్నారు.. అన్ని క్రీడా పోటీల్లో చక్కని ప్రతిభ కనబరచి సత్తా చాటుతున్నారు.. చదువులోనూ ముం దుండి అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు.
- పెద్ద కోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ
- క్రీడా పోటీల్లో సత్తా చాడుతూ ఓవరాల్ చాంపియన్స్‌గా నిలుస్తూ…
- వరుసగా మూడు సార్లు చాంపియన్ షిప్ కైవసం
- చదువుతోపాటు ఆటల్లో రాణిస్తున్న విద్యార్థినులు
చిన్నకోడూరు, జనవరి 11: ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్‌గా నిలుస్తున్నారు.. అన్ని క్రీడా పోటీల్లో చక్కని ప్రతిభ కనబరచి సత్తా చాటుతున్నారు.. చదువులోనూ ముం దుండి అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచి శభాష్ అనిపించుకున్నారు. క్రీడల్లో రాణిస్తూ క్రీడా రాణులకు కేరాఫ్‌గా మారుతున్నారు పెద్ద కోడూరులోని ప్రభుత్వ మహిళా సాంకేతిక కళాశాల విద్యార్థినులు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లాలోని మొత్తం 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల నుంచి 58 మంది విద్యార్థినులు పలు క్రీడాంశాల్లో పాల్గొని తమదైన ఆటతీరుతో సత్తా చాటారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడలపై పట్టుదలతో ముందుకు సాగడమే కాక తమ ప్రిన్సిపాల్ సహకారంతో వరుసగా మూడు సార్లు ఛాంపియన్ షిప్‌లను కైవసం చేసుకోగలిగామని ఆ విద్యార్థినులు చెబుతున్నారు. చదువుతోపాటు క్రీడా విభాగాల్లో రాణిస్తూ విజయాలు సాధిస్తూ మంత్రి హరీశ్ రావు వంటి పలువురు ప్రముఖుల అభినందనలు అందుకోవడం తమకు గర్వంగా ఉందని ఆ కాలేజీ అధ్యాపక బృందం పేర్కొంటున్నది.
మూడోసారి సత్తా చాటిన విద్యార్థులు
పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు మూడోసారి తమ సత్తాను చూపించి ఓవరాల్ చాంపియన్‌గా నిచారు. కబడ్డీ, ఖోఖో, బాలీబాల్, బ్యాట్మింటన్ డబుల్స్, సింగిల్స్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 100 మీటర్లు, 400 మీటర్లు, పరుగు పందెంలో చక్కటి ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతును గెలుచుకున్నారు. ఇలా వరుసగా మూడు సార్లు గెలుపొందడంపై ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, అధ్యాపక బృం దం అభినందనలు అందుకున్నారు. అథ్లెటిక్స్‌లో రెండు ద్వితీయ బహుతులను సాధించారు.
ఓవరాల్ చాంపియన్‌గా నిలువడం చాలా సంతోషంగా ఉంది
గజ్వేల్‌లో నిర్వహించిన పోటీల్లో తమ కాలేజీ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరచి కాలేజీ పేరును నిలబెట్టారు. మూడు సార్లు వరుసగా ఓవరాల్ చాంపియన్‌గా నిలువడం ఆనందంగా ఉంది. చదువుతోపాటు క్రీడలపై చాలా ఆసక్తి చూపుతారు. విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగి రాష్ట్రస్థాయిలో సత్తా చాటి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
– విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ ( మహిళా పాలిటెక్నిక్ కళాశాల)
చాలా సంతోషంగా ఉంది
నాకు క్రీడలపై చాలా ఆసక్తి ఉంది. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనాలని ఎంతో ఉత్సాహం ఉండేది. మా కళాశాల అధ్యాపకులు ఎంతో ప్రోత్సాహకాన్ని అందించారు. వాలీబాల్ పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందడం నాకు చాలా సంతోషంగా ఉంది.
– అశ్విని, వాలీబాల్ క్రీడాకారిణి
రాష్ట్రస్థాయిలో రాణిస్తా
ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మా కళాశాల తరపున పాల్గొన్నాను. ఖోఖో పోటీల్లో అందరి ప్రోత్సాహంతో ప్రథమ బహుమతి గెలుపొందాను. ఫిబ్రవరిలో రాష్ట్రస్థాయిలో రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకు
-దీక్షిత, ఖోఖో క్రీడాకారిణి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

