సరస్వతి కృషి మరువలేనిది
తెలంగాణ సాధన కోసం మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి కృషి మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి విగ్రహాన్ని ఆమె భర్త మెరుపుల నారాగౌడ్తో కలిసి ఆవిషరించారు.
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
- సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో మెరుపుల సరస్వతి విగ్రహావిషరణ
సిద్దిపేట, జూలై 14 : తెలంగాణ సాధన కోసం మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి కృషి మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి విగ్రహాన్ని ఆమె భర్త మెరుపుల నారాగౌడ్తో కలిసి ఆవిషరించారు. సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. మెరుపుల సరస్వతి 23 ఏండ్లు ప్రజాసేవ చేశారన్నారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆనాటి ప్రభుత్వాలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా మెరుపుల సరస్వతి, నారాగౌడ్ ఉద్యమంలో పనిచేశారని గుర్తుచేశారు. సరస్వతి గ్రామానికి వచ్చిన సందర్భంలో రోడ్లు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేశారన్నారు. నేడు సరస్వతి విగ్రహాన్ని ఆవిషరించడం సంతోషంగా ఉందన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తారని, వారు చేసిన మంచి పనులే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు.
కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తుపాకుల బాల్‌రంగం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్‌వర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పల్ సాయిరామ్, గుండు భూపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర యా దయ్య, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, గ్రామ మాజీ సర్పంచ్ భూమయ్య గారి కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రఘోత్తంరెడ్డి, నాయకుడు పూల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

