కంది, మార్చి 17: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్-విజన్ 2024 వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పలు ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.
వేడుకల్లో భాగంగా ఆదివారం హిప్ హాప్ ఇండియా ఛాంపియన్ షిప్ కోసం సోలో, డ్యుయో డ్యాన్స్‌లు చేశారు. స్పోర్ట్స్ క్విజ్ నిర్వహించడంతో పాటు హీలింగ్ లిటిల్ హార్ట్స్‌కు అనుగుణంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ అవగాహన కల్పించారు. డీజే ఆర్గానిక్ ద్వారా విద్యుద్ధీకరణ, డీజే ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు.