పాపన్నపేట: అక్టోబర్ 7 : ఉపాధి కోసం పనికి వెళ్తున్న కూలీలకు ఎండలో పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) యాదయ్య పరిశీలించిన ఆయనకు కూలీలు తమ సమస్యలను వివరించారు. పనుల వద్ద నీడలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో స్పందించిన డీపీఓ.. వెంటనే టెంట్లు ఏర్పాటు చేసి, తాగునీరు అందుబాటులో ఉంచాలని సర్పంచ్ మల్లేశం, పంచాయతీ కార్యదర్శి వెంకటేశంను ఆదేశించారు.
గ్రామంలోని డీపీఓ పర్యటించి డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలాచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కూలీలతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అయన వెంట ఉపసర్పంచ్ నరేష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.