హుస్నాబాద్ డివిజన్లో 10,359 రైతులకే రుణమాఫీ
హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, ఇందులో కేవలం 10,359 మంది రైతులకు మాత్రమే మొదటి విడత రుణమాఫీ దక్కిం ది.
- నాలుగు మండలాల్లో మొత్తం 54,739మంది రైతులు
- అయోమయంలో ఇంకా రుణమాఫీ కాని రైతులు
- సంబురాలకు రైతుల నుంచి స్పందన కరువు
హుస్నాబాద్, జూలై 18: హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, ఇందులో కేవలం 10,359 మంది రైతులకు మాత్రమే మొదటి విడత రుణమాఫీ దక్కిం ది. ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నామంటూ ప్రకటించినప్పటికీ కొం దరు రైతులకు అవి కూడా పడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలోపు రుణం తీసుకున్న రైతుల పేర్లు కూడా కొందరివి జాబితాలో లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. మాకెప్పుడు రుణమాఫీ అవుతుందని అధికారుల వద్దకు వెళ్లి పడిగాపులు గాస్తున్నారు.
సాంకేతిక కారణాల వల్ల జాబితాల్లో పేర్లు రాలేదని, మరో జాబితాలో పేరు వస్తుందని అధికారులు అంటున్నారని పలువురు రైతులు చెప్తున్నారు. మొదటి విడతలో రుణమాఫీ అయిన రైతులు సంబురపడుతుండగా, అన్ని అర్హతలు ఉండి కూడా వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతుల్లో ఆందోళన నెలకొంది. డివిజన్లోని నాలుగు మండలాల్లో కొందరు రైతులు పంటరుణాలు తీసుకోలేదు. పంటరుణం తీసుకున్న రైతుల్లో కేవలం ఇరవైశాతం మందికే రుణమాఫీ జరిగిందనేది నిపుణుల వాదన.
రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. కాగా, గురువారం సాయంత్రం రైతు వేదికల్లో జరిగిన సంబురాల్లో రైతుల నుంచి అనుకున్నంత స్పందన లభించక పోవడం విశేషం. కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి మరికొందరికి చేయక పోవ డం, జాబితాలో పేరున్నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడినట్లు సమాచారం రాకపోవడంతో రైతులు సంబురాల్లో పాల్గొనేందుకు ముందుకు రాలేదు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి విడత రుణమాఫీపై ఎక్కువ మంది రైతులు పెదవి విరుస్తుండటం గమనార్హం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

