టీఎస్‌బీపాస్‌తో అనుమతులు సులభం
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీఎస్‌బీపాస్) ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా, పారదర్శకంగా భవన నిర్మాణానికి అనుమతులు, లే అవుట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వ డానికి ప్రభుత్వం 2019లో తెలంగాణ రాష్ట్ర నూతన భవన అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టింది. సామాన్యుడి నుంచి ప్రాపర్టీ డెవలపర్ల వరకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి టీఎస్‌బీపాస్ విధానం
- సులభంగా, వేగంగా,పారదర్శకంగా ఇంటి నిర్మాణ, లే అవుట్లకు అనుమతులు
- ఒకే దరఖాస్తుపై అన్నిశాఖల అమోదం
- 21 రోజల్లో నిర్మాణాలకు పర్మిషన్ జారీ
తూప్రాన్, జనవరి 1 : తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీఎస్‌బీపాస్) ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా, పారదర్శకంగా భవన నిర్మాణానికి అనుమతులు, లే అవుట్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వ డానికి ప్రభుత్వం 2019లో తెలంగాణ రాష్ట్ర నూతన భవన అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టింది. సామాన్యుడి నుంచి ప్రాపర్టీ డెవలపర్ల వరకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి టీఎస్‌బీపాస్ విధానం ఎంతో ఉపయోగపడుతున్నది. టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణాల అనుమతి సులభంగా, స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణమే ఇస్తున్నారు.
75 చదరపు గజాలు లేదా 62.7చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ప్లాటలో గ్రౌండ్ ప్లస్ 1 వరకు నివాస భవన నిర్మాణా నికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. దీని కోసం కేవలం నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లించి, భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. 75 చదరపు గజాల నుంచి 239.20 చదరపు గజాలు (200 చదరపు మీటర్ల) విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో గ్రౌండ్ ప్లస్ 1 వరకు 7 మీటర్ల వరకు ఎత్తు ఉండే నివాస భవన నిర్మాణానికి తక్షణ అనుమతి ఇస్తున్నారు. 239.20 చదరపు గజాల నుంచి 598 చదర పు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల ఇంటి నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణమే అనుమతి ఇస్తారు. ఇంటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత స్వాధీనతా ద్రువీకరణ పత్రం అధికారుల నుంచి పొందాల్సి ఉం టుంది. 598 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే ప్లాట్లతోపా టు అన్ని నివాసేతర భవనాలకు సింగిల్ విండో విధానంలో నిర్మాణానికి అనుమతులు ఇస్తారు.
టీఎస్‌బీపాస్‌లో ఇంటి నిర్మాణానికి ఉమ్మడిగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. ఇంటి నిర్మాణానికి ప్రత్యేకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కొరకు ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం లేదు. టీఎస్‌బీపాస్ ప్రత్యేకత ఏమిటంటే.. భవన నిర్మాణ లేదా లేఅవుట్ల కొరకు వ్యక్తులు లేదా సంస్థలు దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తులను పరిశీలించి 21 రోజల్లో నిర్మాణ అనుమతు లను జారీ చేస్తారు. కార్యాలయాల చుట్టూ తిరగడం లాంటి కాలయాపనకు ఆస్కారమే లేదు. ఒకవేళ 21 రోజుల్లో దరఖాస్తును పరిశీలించకున్నా.. అనుమతి ఇచ్చినా లేదా తిరస్కరించడం చేయకుంటే అనుమతించి ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్లైన్లో అనుమతి పత్రం ఆటోమెటిగ్గా జనరేట్ అవుతుంది. 239.20 చదరపు గజా ల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తు నిర్మించే నివాస భవనాలకు యజమాని లేదా అర్కిటెక్ అటెస్టెడ్ చేసినా సరిపోతుంది. స్వీయ ధ్రువీకరణ ఆధారం గా నివాసేతర భవనాలన్నింటికీ స్వాధీనతా ధ్రువీకరణ ప త్రాన్ని 15 రోజుల్లో జారీ చేస్తారు. స్వీయ ధ్రువీకరణతో జారీ చేసిన అన్ని అనుమతులకు పోస్ట్ వెరిఫికేషన్ చేస్తారు.
వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాలు చేస్తే శిక్షార్హు లు అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే జరిమానా విధింపు లేదా నిర్మాణాన్ని కూలగొట్టడం, సీల్ వేయడం లేదా స్వాధీనం చేసుకుంటారు.
అవినీతి లేకుండా అనుమతులు
టీఎస్‌బీపాస్ ద్వారా ఎలాంటి అ వినీతి, అక్రమాలకు తావులేకుండా పౌరులకు పారదర్శకమైన సేవలు ల భిస్తాయి. అనుమతుల కోసం మీసేవ లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖా స్తు చేసుకోవచ్చు. ప్రజలు ఒక్క రూ పాయి కూడా ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండ దు. ఆ మాటకొస్తే కార్యాలయానికి రావాల్సిన అవసరమే లేదు. టీఎస్‌బీపాస్ ద్వారా 2022 అక్టోబర్ నాటికి మెదక్ మున్సిపాలిటీలో 560 ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. మెదక్ తర్వాత అత్యధికంగా తూప్రాన్ మున్సిపాలిటీలో 335, రామాయంపేటలో 169, నర్సాపూర్‌లో 169 ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు.
– టి.మోహన్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Approval
- construction
- easier
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

