ఎఫ్‌సీఐ ధాన్యాన్ని వేగంగా తరలించాలి
ఈ నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్సీఐకు వెంటనే తరలించాలని రైస్ మిల్లర్లకు మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
- కొనుగోలు కేంద్రాలు సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్, మే 5 (నమస్తే తెలంగాణ): ఈ నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్సీఐకు వెంటనే తరలించాలని రైస్ మిల్లర్లకు మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి వానకాలంలో పెండింగ్ సీఎంఆర్, ప్రస్తుత ధాన్యం దిగుబడిపై రైస్‌మిల్లర్లు, తహసీల్దార్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశమై బియ్యం చేరవేయడంలో ఉన్న స్టెన్సిలింగ్, గన్నీ బ్యాగులు, డబుల్ స్టిచ్చింగ్ వంటి చిన్న చిన్న సమస్యలను పరిషరించినట్లు తెలిపారు. 2021- 22 ఖరీఫ్‌కు సంబంధించి పెండింగ్ ఉన్న ధాన్యాన్ని రోజుకో రైస్‌మిల్లర్ 58 మెట్రిక్ టన్నుల చొప్పున 30 రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐకి వేగవంతంగా తరలించాలన్నారు. లేకుంటే డిఫాల్టర్ జాబితాలో చేర్చడంతో పాటు 125 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2021-22 యాసంగికి సంబంధించి ప్రభుత్వం గడవు పొడిగించే అవకాశం ఉందన్నారు. సీఏంఆర్ ఫెర్ఫార్మెస్ బాగున్న వారికే ధాన్యం కేటాయిస్తామన్నారు. హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ప్రస్తుతం వస్తున్న యాసంగి ధాన్యాన్ని త్వరత్వరగా దించుకుని ట్రక్ షీట్ ఇవ్వాలన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 35 బాయిల్డ్ రైస్ మిల్లులకు ఇప్పటి వరకు 12 మిల్లుల వారే ధాన్యం దించుకున్నారని, నర్సాపూర్, శివ్వంపేట వంటి ప్రాంతాల్లో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని, ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. తహసీల్దార్లు రోజూ రెండు మిల్లులను సందర్శించి సీఏంఆర్ రైస్‌ను ఎఫ్‌సీఐకి తరలిస్తుండడంతో పాటు హమాలీలు ఎకువగా పెట్టుకుని యాసంగి ధాన్యం దించుకునేలా రైస్‌మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ వీఆర్ఏలను అప్రమత్తం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా చేసేలా నిర్వాహకులను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

