బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకుండా చూడటం సిగ్గుచేటుగా ఉందన్నారు.
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, జూలై 24: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకుండా చూడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో ఎంపీలు మౌనంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్రమోదీ సర్కారుకు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తెలంగాణకు గుండుసున్న నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీ ఎంపీలను అడుగడుగునా ప్రశ్నించాలన్నారు. మోదీ సర్కారు తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ తీరు చూస్తుంటే ఇక్కడ చోటే బాయ్…అక్కడ బడే బాయ్ అన్నట్లు ఉందన్నారు. చోటే బాయ్ రాష్ట్ర నిధులను హైకమాండ్‌కు తరలిస్తుంటే బడేబాయ్ సంకీర్ణ ప్రభుత్వంలోని బీహార్, ఏపీలకు నిధులు కేటాయించి తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా, నిధులు, ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపులేదని, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా బలపడిందన్నారు. ఇప్పటి వ రకు రైతులకు రూ.20వేల కోట్ల రైతుబంధును ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, జూన్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు నేటికీ ఇవ్వలేదన్నారు.
ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నవాజ్‌మీరా, శ్రీనివాస్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, అత్తెల్లి శ్రీనివాస్, గుంటుక రాజు, కిషన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, జఫర్‌ఖాన్, గొడుగు స్వామి, నర్సింగరావు, ఉపేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, కవిత, శివకుమార్, హైదర్‌పటేల్, బీమప్ప, కిరణ్, ఎక్బాల్, అహ్మద్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

