సంక్షేమ బీఆర్ఎస్ను ఆదరించండి
బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్ తెలిపారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
- స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావును మరోసారి ఆశీర్వదించండి
- రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ
చైర్మన్ తన్వీరు - అర్జున్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం
జహీరాబాద్, నవంబర్ 1: బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్ తెలిపారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసంచేసేందుకు సాధ్యంకాని హామీలు ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా కల్పిస్తుందన్నారు.
ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం, రైతుబంధు రూ.16 వేలకు పెంచడం, కేసీఆర్ ఆరోగ్య రక్ష కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లు రూ.5016 ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండరు రూ.400 ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్నబియ్యం సరఫరా, అగ్రవర్ణ పేదలకు గురు కుల పాఠశాలలు ఏర్పాటు చేస్తుందన్నారు. సౌభాగ్యలక్ష్మిలో అర్హులైన పేద కుటుంబాల మహిళలకు రూ. 3వేలు చెల్లిస్తామన్నారు. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. అర్జున్ నాయక్ తండాకు చెందిన దశరథ్, రవితోపాటు పలువురు పార్టీలో చేరిన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు హీరు రాథోడ్, గ్రామ నాయకులు గులాబ్ సింగ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

