హైదరాబాద్‌కు మెట్రో మణిహారం
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- రూ.6,250 కోట్లతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో
- శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
- ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నిర్మాణం
కాలుష్య రహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రో. దీన్ని మరింతగా విస్తరించాల్సిన
అవసరమున్నది. అందుకే హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వలయం ఏర్పాటు చేస్తాం. ఓటర్ రింగ్ రోడ్డుకుఅనుసంధానంగా గ్రేటర్ చుట్టూ మెట్రో సేవలను విస్తరిస్తాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ రాలేదు. ఈ లోపాన్ని తీర్చేందుకే రూ.6,500 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టును మూడేండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తాం.
– సీఎం కేసీఆర్
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 11.23 గంటలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో వేదికపైన చండీమాత వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆనంద్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, కె.నవీన్‌కుమార్, పట్నం మహేందర్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, రావుల శ్రీధర్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, దేశ్‌పతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భారీ శిలాఫలకం
మైండ్‌స్పేస్ వద్ద ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్’ పేరిట భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ బస్సు దిగిన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. దేశ్ కీ నేత, జై బీఆర్ఎస్ అంటూ స్లోగన్స్ మిన్నంటాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

