కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి
కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేవీపీసీ కన్వీనర్లు మంగయ్య, బాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు సంయుక్తంగా మూడు గంటల పాటు ఆందోళన చేశారు.
- గుమ్మడిదలలో కేవీపీసీ మహాధర్నా
గుమ్మడిదల, నవంబర్ 25: కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేవీపీసీ కన్వీనర్లు మంగయ్య, బాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు సంయుక్తంగా మూడు గంటల పాటు ఆందోళన చేశారు. కేవీపీసీ కన్వీనర్ మంగయ్య మాట్లాడుతూ.. నల్లకుంట చెరువు పైభాగంలో ఉన్న రసాయన పరిశ్రమలు వర్షం మాటున వదిలిన వ్యర్థజలాలతో చెరువంతా కలుషితమైందన్నారు.
ఈ చెరువు నీరు కలుషితం కావడంతో పశువులు మృతిచెందుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. నల్లకుంట నీటి నుంచి శాంపిల్స్‌ను సేకరించిన పీసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దోమడుగులోని నల్లకుంట కలుషితం కావడానికి కారణమైన పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దోమడుగు కేవీపీసీ సభ్యులు గుమ్మిడిదల తహసీల్దార్ ఎం.పరమేశ్‌కు, గుమ్మిడిదల మున్సిపల్ కమిషనర్ దశరథ్కు ఫిర్యాదు చేశారు.
మహాధర్నాకు పర్యావరణ ప్రేమికుడు అశోక్‌కుమార్, జానపద కళాకారుడు వీఎం ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ధర్నాలో కేవీపీసీ కన్వీనర్లు మంగయ్య, బాల్‌రెడ్డి, కో-కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, శ్రీధర్, సభ్యులు రాజు, వెంకటేశ్, రమేశ్, యాదగిరి, బాలుగౌడ్, జయమ్మ, అనురాధ, అఖిల, అనసూజ, చింతల లక్ష్మీ, రూప, సంగీత, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

