సెల్‌ఫోన్ వద్దు.. ఆటలే ముద్దు
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్‌కు వెళ్లాడు. పేరేంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడుగా ఓ పక్కన కూర్చొని సెల్‌ఫోన్ ప్రపంచంలో మునిగిపోయాడు. సీన్ కట్ చేస్తే అతడి తండ్రి చాలా సేపట్నుంచి మొబైల్ వాడుతున్నాడంటూ బాబు నుంచి మొబైల్ లాక్కున్నాడు.
- చిన్నారులను వెంటాడుతున్న మొబైల్ భూతం
- వారిని వశపరుచుకుంటున్న స్మార్ట్ఫోన్లు
- వ్యసనంలా మారుతున్న వాడకం
- బయటపడలేక మానసిక, శారీరక సమస్యలు
- తల్లిదండ్రులదే ఆ పాపం అంటున్న సైకాలజిస్టులు
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్‌కు వెళ్లాడు. పేరేంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడుగా ఓ పక్కన కూర్చొని సెల్‌ఫోన్ ప్రపంచంలో మునిగిపోయాడు. సీన్ కట్ చేస్తే అతడి తండ్రి చాలా సేపట్నుంచి మొబైల్ వాడుతున్నాడంటూ బాబు నుంచి మొబైల్ లాక్కున్నాడు. ఇక షురూ అయింది. షాపింగ్ మాల్ అంతా ధ్వనించేలా ఏడ్పు అందుకున్నాడు. అటు ఇటూ పరుగెడుతూ కేకలు వేస్తున్నాడు. కిందపడిపోయి బోర్లుతున్నాడు. ముందర ఉన్న వస్తువులను ఇసిరిపడేస్తున్నాడు. పిల్లాడి ప్రవర్తనను చూసిని అక్కడి వారంతా ఏం జరుగుతుందోనని తదేకంగా చూస్తున్నారు. వామ్మో అనుకున్న తండ్రి వాడి చేతిలో మళ్లీ సెల్‌ఫోన్ ఉంచగానే ఒక్కసారికి ఉరుముల వాన.. ఆగిపోయినట్టుగా ప్రశాంతత ఆవరించింది.” ఇలాంటి సంఘటనలు చాలా మంది తల్లిదండ్రులకు అనుభవమే.
సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : పిల్లలు మొబైల్ లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? అదే ధ్యాసగా ఎందుకు సాగుతున్నారు. ఎవరో మొబైల్ తాంత్రిక ప్రయోగం చేసినట్టుగా దానిని దూరం చూస్తే ఉద్వేగాలను కోల్పోతున్నారు. గుక్కపెట్టి ఏడుస్తూ బేజారెత్తిస్తున్నారు. మళ్లీ వారి చేతిలో ఫోన్ పెడితేగానీ మన ధ్యాసలోకి రావడం లేదు. అట్లాంటి మొబైల్ తాంత్రిక ప్రయోగం నుంచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎవరు అలవాటు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలా వారిని ఆ ప్రమాదం నుంచి బయటపడేయ్యాలో తెలిపే సైకాలజిస్టుల సూచనలపై
నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం
నెమ్మదిగా దృష్టి మరల్చాలి..
మొబైల్‌కు వ్యసనంగా మారిన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరి పిల్లలకు ఎంత సులభంగా మొబైల్స్ అలవాటు చేస్తారో.. మాట వినకపోతే వాటిని వాళ్ల నుంచి అంతే బలవంతంగా తీసుకంటారు. అప్పటికే మొబైల్ వ్యసనంగా మారిన పిల్లల్లో ఇది తీవ్రమైన మనోవ్యాకులతకు గురి చేస్తుందని సైకాలజిస్టులు తెలిపారు. అలా చేయడం ప్రమాదకరం అలాంటి పరిస్థితుల్లో మొదటగా పిల్లలను ఆకట్టుకునే ఆటలూ, కథలూ, బాలగేయాలు నేర్పే యాప్స్‌ని డౌన్లోడ్ చేసి వారిని అవి చూసేల ప్రోత్సహించాలి. నెమ్మదిగా వారు ప్రయోగకరమైన కంటెంట్‌లోకి వస్తారు. అందులో మంచి అలవాట్లు ఉండటం కారణంగా వాటని పాటిద్దాం అంటూ పేరేంట్స్ అనుసరిస్తూ వారికి నేర్పించాలి. రోజులో గంటకు మించి మొబైల్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్‌ని ఇచ్చినప్పుడు పొరబాటున కూడా అశ్లీల, హింసాత్మకమైన సైట్లు వాళ్ల కంటపడకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
సెలవుల్లో ఇలా చేద్దాం..
- సాధ్యమైనంత వరకు పిల్లలను బయటకు తీసుకెళ్లి ఆడించాలి. ఇతర పిల్లలతో సంతోషంగా ఆడుకునేలా ప్రోత్సాహం అందించాలి.
- ప్రతి కాలనీలో కమ్యూనిటీ పార్కుల్లో ఆటల సామగ్రి ఉంటుంది. వారిని తీసుకెళ్లి ఆడించాలి.
- నగరంలో తక్కువ ఛార్జీలతో పిల్లలు సంతోషంగా ఆడుకునేలా అనేక పార్కులు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ వాడే చిన్నారులను బయట యాక్టివిటీపై బిజీ చేయాలి. జూపార్క్స్, స్విమ్మింగ్ తదితర పర్యాటక ప్రాంతాలకు తిప్పాలి.
- పిల్లలు మొబైల్ వాడుతుంటే పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
- సోసల్ మీడియా, ఆన్లైన్లో ఉండే సమయంలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి.
- మీరు దగ్గరకు వెళ్లినప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను మార్చుతున్నారా? అనేది చూసుకోవాలి.
- పిల్లల మొబైల్లో కొత్త ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్ ఉంటే చెక్ చేయాలి.
- ఇంటర్నెట్ వినియోగించాక పిల్లల ప్రవర్తన అనేది ఎలా ఉండాలనేది పరిశీలించాలి.
- ఇంటర్నెట్ వినియోగంతో లాభాలు, నష్టాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.
పేరెంట్స్ మీదే బాధ్యత..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పదేపదే ఏడుస్తున్నారని, దేనికో మారాం చేస్తున్నారని చటుక్కున మొబైల్ ఫోన్ ఇవ్వడం సాధారణంగా మారింది. ఇది చాలా ప్రమాదకరం. మొదట వారు ప్రతీది చుట్టూ ఉన్న బాహ్య వస్తువులకే అలవాటు పడాలి. అప్పుడే వాళ్ల మెదడు సహజంగా వృద్ధి చెందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల ముందర పేరేంట్స్ అధికంగా మొబైల్లో గడపకూడదు. ఇది చాలా ప్రమాదకరం. వారు వచ్చి మాట్లాడితే పట్టించుకోకుండా మొబైల్లో గడిపితే వారు కూడా మిమ్మల్నీ అనుసరిస్తారు. పక్కనుంచే వారిని పట్టించుకోరు. ఇది వారిలోని భాషా నైపుణ్యాలను ఎదగనివ్వదు.

వారి భవిష్యత్తుకు అండగా నిలవాలి
మొబైల్‌ను వాడుతున్న చిన్నారులు ఎక్కువగా కార్టూన్స్, చిన్క పిల్లల యాక్టివిటీస్ చూస్తుంటారు. వారికి అవే ఎంతో గొప్పగా అనిపిస్తాయి. అవి తప్ప మరేవి ఆసక్తికరంగా కనిపించవు. పది నిమిషాల కంటే ఎక్కువ దేనిపైన శ్రద్ధ పెట్టలేరు. దీనిని అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటారు. అయితే ఈ తప్పంతా తల్లిదండ్రులదే. పిల్లల్నీ సాంకేతిక పరికరాలకు అతుక్కుపోయేలా తల్లిదండ్రులు చేస్తున్నారు. పిల్లలను ఎలా అదుపు చేయాలో తెలియక ఎక్కువ మంది పేరేంట్స్ మొబైల్ ఇస్తున్నారు.
-ఎం. రామచందర్, సైకాలజిస్టు
ముందుగా మారాల్సింది తల్లిదండ్రులే
రాత్రుళ్లు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే లేత నీలి వెలుగు నిద్ర కరువు చేస్తుంది. వీటి బారినపడుతున్ప పిల్లలు చిన్నప్పుడే తీవ్ర నిద్రలేమీకి గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోతున్నారు. ఉద్వేగాలని అదుపు చేయగలిగే పరిస్థితి కూడా ఉండట్లేదు. ముందుగా మారాల్సింది తల్లిదండ్రులే. మనమెలా మార్గదర్శనం చేస్తే వాళ్లు అలా ముందుకెళ్తారు. ఏదైనా శారీరక, మానసిక వ్యాయామాన్ని ఇచ్చే క్రీడల్లో వాళ్లను ప్రోత్సహించాలి.
-కవిత పాన్యం, సైకాలజిస్టు
చంటి పిల్లలూ.. జరభద్రం..
మొబైల్ ఎక్కువగా వాడటం వలన పిల్లలకు ఆటిజం లాంటి సమస్య కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి ఏడుస్తుందని పేరేంట్స్ ఆమెకు సెల్‌ఫోన్ ఇస్తే ఆడుకుంటుండగా మొబైల్ పేలి ఆ బాలిక చనిపోయింది. పిల్లల ఎదుగుదలలో తొలి రెండు నుంచి నాలుగేళ్లు చాలా కీలకం. వాళ్ల మెదడు వేగంగా వికసించే వయసు ఇది. తల్లిదండ్రులు చెప్పే మాటలు విని ఊకొట్టి, వాళ్లని అనుసరించే అన్నీ నేర్చుకుంటారు. ఆట వస్తువుల్ని తరిచి చూసే స్పర్శజ్ఞానం తెలుసుకుంటారు. బయట పిల్లలతో కలిసి ఆటలాడటం ద్వారా వ్యక్తీకరణ, ఎమోషన్స్ నేర్చుకుంటారు. సహజమైన ఈ ఎదుగుదలకు గ్యాడ్జెట్లు అడ్డుపడుతున్నాయి. పిల్లలను పూర్తిగా తమ వశం చేసుకుని కదలనివ్వకుండా చేస్తున్నాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

