జన్ ఆరోగ్య సమితులను ఏర్పాటు చేయాలి
జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జన్ ఆరోగ్య సమితీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
- ఎస్హెచ్సీలు, హెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో నెలకొల్పాలి
- వారంలోగా పూర్తి చేయాలి
- సమితి పాత్ర, బాధ్యతల చార్టును ప్రదర్శించాలి
- సంగారెడ్డి కలెక్టర్ శరత్
- కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం
సంగారెడ్డి కలెక్టరేట్, మే 15 : జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జన్ ఆరోగ్య సమితీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ వారంలోగా అన్ని సబ్ హెల్త్ సెంటర్లు, హెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో జన్ ఆరోగ్య సమితీలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 173 సబ్ హెల్త్ సెంటర్లు, 26 హెచ్‌సీలు, 4 యూపీహెచ్‌సీల్లో జన్ ఆరోగ్య సమితీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.
జన్ ఆరోగ్య సమితి పాత్ర, బాధ్యతలకు సంబంధించి చార్ట్‌ను ఆయా ఆరోగ్య కేంద్రాల్లో అందరికి కనిపించేలా ప్రదర్శించాలన్నారు. జన్ ఆరోగ్య సమితి ప్రతినెల మూడో శనివారం సమావేశం నిర్వహించాలన్నారు. ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, డీఆర్డీవో శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈ పాషా, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

