Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
Congress MLA | వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయం దగ్గరకు వెళ్లాడు. అయితే సదరు వ్యక్తి ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్న వెంకటరాంరెడ్డి ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు.
Congress MLA | అధికారంలో ఉన్న కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు సామాన్య ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్న ఘటనలు ఎక్కడో ఒక చోట తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ దళితుల పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి దళిత కుటుంబాన్ని గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయం దగ్గరకు వెళ్లాడు. అయితే సదరు వ్యక్తి ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్నవెంకటరాంరెడ్డి ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు.
వెంకటరాం రెడ్డి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు కట్టించలేదు.. మేమంతా చందాలు వేసి కట్టించుకున్నాం.. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజుల నుంచి లేనిది.. ఇవాళ కొత్తగనా..? నిన్నెవడు రమ్మన్నడు అంటూ.. ఈ కాలంలో కూడా దళితులపై వివక్ష ఎందుకంటూ ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పాలనలో దళితుల పట్ల ఎలాంటి అణచివేత ధోరణి ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది.
దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోకుండా ఓ వ్యక్తిని అడ్డుకున్న వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి
ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ దౌర్జన్యం
ఈ కాలంలో కూడా దళితులపై వివక్ష ఎందుకంటూ బాధితుడి ఆవేదన
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

