ఊట్కూర్, జనవరి 13 : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మెల్విన్ జోన్స్ స్ఫూర్తి తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్, నారాయణ, నీల్రాజ్ పాల్గొన్నారు.
నారాయణపేట, జనవరి 13 : లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతిని పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో ఘనంగా జరుపుకొన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ భట్టడ్ ఆయన చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ నుంచి ఎ న్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు జనార్దన్, కార్యదర్శి సాయినాథ్, కోశాధికారి రవికుమార్‌గౌడ్, ఆత్మారాం ఎడ్కే, కృష్ణమూర్తి, సదానందాచారి, అమరేశ్ తదితరులు పాల్గొన్నారు.