తొలి ఏకాదశికి వేళాయే..
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉన్నది. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడం వల్ల ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు.
- నేడు వైష్ణవాలయాల్లో వేడుకలు
- శివ, కేశవులకు ప్రీతిపాత్రమైన పండుగ
- చాతుర్మాస్య వ్రతం ఆరంభం
- ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు
గద్వాల టౌన్/వనపర్తి టౌన్, జూన్ 28 : ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉన్నది. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడం వల్ల ఈ ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పండుగ విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది. 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేకపోయినా ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే కోటి పుణ్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని హిందువుల నమ్మకం.
తొలి ఏకాదశి హైందవులకు పర్వదినం. దీన్ని హరివాసరం అని పిలుస్తారు. సకల చరాచర జీవకోటిని అనుగ్రహించే ఆ దేవదేవుడు మహావిష్ణువు ఏకాదశి నుంచి ఆరునెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు. తిరిగి మార్గశిర శుద్ధ ఏకాదశి(వైకుంఠ ఏకాదశి)నాడు మేల్కొని భక్తులకు ఉత్తర ద్వారం మీదుగా దర్శనమిస్తారు. ఈ ఏకాదశి నుంచే దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి ఉత్తరాయణం వరకు విష్ణుభక్తులు చాతుర్మాస్య వ్రతం, ఉపవాప దీక్ష స్వీకరించి హరినామ సంకీర్తనలతో గడుపుతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరి హరి దర్శనం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు ఇండ్లను శుభ్రపర్చుకొని ఉపవాసం, జాగారం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆవులను పూజించాలి. మరుసటి రోజు కాలకృత్యాలు ఆచరించాక ఆలయాల్లో పూజల అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ఏడాది హిందూముస్లింల పండుగలు ఒకేరోజున రావడంతో భారతీయ ఐక్యతకు నిదర్శనంగా నిలువనున్నది.
శివ, కేశవులకు ప్రీతిపాత్రమైంది..
తొలి ఏకాదశి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు శివకేశవులను దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయన్న నమ్మకంతో భక్తులు ఉపవాసం స్వీకరించి భక్తిశ్రద్ధలతో వారిని ఆరాధిస్తారు.
ముస్తాబైన ఆలయాలు..
తొలి ఏకాదశికి వైష్ణవ ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవుడి ఆలయం, గంజిపేటలోని వేంకటేశ్వరాలయం, బుర్ధాపేటలోని రంగనాథస్వామి, పె ద్ద అగ్రహారంలోని లక్ష్మీనర్సింహస్వామి, నది అగ్రహారంలోని రామాలయం, కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు అ న్ని ప్రధాన ఆలయాలు వేడుకులకు సిద్ధమయ్యాయి.
ఆలయాల్లో నిర్వహించే పూజలు
తొలి ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, అర్చనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 6గంటల నుంచే పూజలు ప్రారంభమవుతాయి. అభిషేకాలు, పుష్పార్చన అనంతరం స్వామిని విశేష అలంకరణలో పూజిస్తారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

