పేదల ఆత్మబంధువు హరీశ్‌రావు రాక
గతంలో దవాఖానలకు పోవాలంటే.. ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖాన’కు అన్న రోజులు ఉండేవి. ప్రైవేటు దవాఖానలకు వెళ్లాలంటే జేబులు గుల్ల అయ్యేవి.
- నేడు ‘పేట’, వనపర్తి జిల్లాల్లో మంత్రి పర్యటన
- ప్రభుత్వ దవాఖానల భవనాలకు శంకుస్థాపన
- కోస్గి, మక్తల్, కొత్తకోటలో బహిరంగ సభలు
- పేదల ఆత్మగౌరవ ప్రతీక ‘డబుల్’ ఇండ్లకు శ్రీకారం
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు
మహబూబ్‌నగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో దవాఖానలకు పోవాలంటే.. ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖాన’కు అన్న రోజులు ఉండేవి. ప్రైవేటు దవాఖానలకు వెళ్లాలంటే జేబులు గుల్ల అయ్యేవి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఆనాటి నానుడి కనుమరుగైపోయింది. నూతన భవనాలు, దవాఖానల స్థాయి పెంపు, వసతులు, 24 గంటలు అందుబాటులో వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు వెలిశాయి. అంతేగాక ప్రతి మండల కేంద్రంలో కనీస 30 పడకల స్థాయిలో వసతులు కల్పించారు.
దీంతో ప్రభుత్వ వైద్య సేవలపై భరోసా పెరిగి దవాఖానలకు క్యూ కడుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో విసిరేసినట్లు ఉండే దవాఖానలను ఇప్పుడు ప్రజలకు అవసరమున్న చోట నిర్మిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో పేదలకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆత్మబంధువుగా మారారు. ఉమ్మడి జిల్లాలో పెద్దాసుపత్రులు, డివిజన్ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా దవాఖానలు ఉన్నా సౌలత్లు అంతంత మాత్రమే.. కానీ తెలంగాణ ఏర్పడ్డాక దవాఖానల రూపురేఖలు మారిపోయాయి.
కార్పొరేట్ స్థాయిలో దవాఖానలను నిర్మిస్తున్నది. అడిగిన వెంటనే దవాఖానలు మంజూరు చేస్తూ పల్లెల్లో వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు పనిచేస్తున్నారు. భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో దవాఖానలు లేని మండలమే కనిపించక మానదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చి దానికి అనుబంధంగా కార్పొరేట్ స్థాయిలో పెద్ద దవాఖానలు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు వైద్యశాలలు మూతపడుడు ఖాయంగా కనిపిస్తుంది.
నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్నారు. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈమేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. రూ.కోట్లతో పనులకు మంత్రులు హరీశ్‌రావు,సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మక్తల్‌లో 150 పడకలు, దేవరకద్రలో వంద పడకలు, కొత్తకోటలో 30 పడకలు స్థాయిలో కొత్తగా నిర్మించే దవాఖాన భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కోస్గిలో వంద పడకల దవాఖానను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి హరీశ్‌రావు హెలీకాప్టర్‌లో కోస్గి పట్టణానికి చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని అదే హెలీకాప్టర్‌లో మక్తల్ చేరుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. మక్తల్ నుంచి కొత్తకోటకు హెలీకాప్టర్‌లో చేరుకొని రోడ్డు మార్గం మీదుగా మదనాపురం మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి కొత్తకోటలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పర్యటన విపక్షాల్లో దడ పుట్టిస్తుంది.
మక్తల్‌లో 150 పడకల దవాఖానకు శ్రీకారం
స్వాత్రంత్యం వచ్చిన నాటి నుంచి కర్ణాటకకు ఆనుకుని ఉన్న మక్తల్ నియోజవకవర్గంలో దవాఖానలు ఉండేవి కావు. దీంతో ఎవరికైనా వైద్య సేవలు అవసరమైతే ఇటు హైదరాబాద్‌కో.. లేదా అటు రాయిచూర్‌కు వెళ్లే పరిస్థితి నాటిది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మక్తల్‌లో ఉన్న ప్రభుత్వ దవాఖాను మెరుగుపర్చి అనేక సౌలత్లు కల్పించారు. ఆధునిక వసతులు కల్పించి పాతబడిన భవనానికి తుదిమెరుగులు దిద్దారు. కర్నిలో ఉన్న పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేసి వైద్య సదుపాయలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా రూ.35 కోట్లతో నియోజకవర్గ కేంద్రంలో 150 పడకల దవాఖానను మంత్రి హరీశ్‌రావు మంజూరు చేశారు. దీంతో బీసీ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో కొత్త దవాఖాన నిర్మించబోతున్నారు. భవనం పనులు పూర్తయితే ఇక్కడి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చొరవతో సుమారు రూ.90 కోట్లతో వివిధ ప్రగతి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
రూ.6 కోట్లతో నిర్మించిన నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లను, కృష్ణ మండల కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించనున్న కేజీబీవీ జూనియర్ కాలేజీకి రూ.5 కోట్లతో నిర్మించిన ఊట్కూర్, నర్వ కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించనున్నారు. రూ.6 కోట్లతో నిర్మించిన వేర్‌హౌసింగ్ గోదాములను, రూ.70 లక్షలతో నిర్మించిన మార్కెట్ కార్యాలయం భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.15 కోట్ల సీఎం ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులను, మున్సిపాలిటీలో రూ.15 కోట్ల టీఎఫ్ఐడీసీ పనులను ప్రారంభిస్తారు. రూ.6 కోట్లతో మక్తల్‌లో నిర్మించే డిగ్రీ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు.
కొత్తకోటలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు
మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కొత్తకోటలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రులకు నీరాజనం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దేవరకద్రకు వంద పడకలు, కొత్తకోటలో 30 పడకల దవాఖాన నిర్మాణానికి ఉమ్మడి జిల్లా మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.
మదనాపురంలో 136 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకే అందించనున్నారు. అనంతరం కొత్తకోటలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ముందుగా కోస్గిలో 50 పడకల దవాఖాన భవనం ప్రారంభంతోపాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, అధికారులు సిద్ధమయ్యారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చడంతో మంత్రి హరీశ్‌రావు పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. గతంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రజాసమస్యలు గాలికోదిలేసిన రేవంత్‌కు ఈ సభతో చెక్‌పెట్టే అవకాశం ఉన్నది. మంత్రి సుడిగాలి పర్యటనతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు మొదలైంది.
మంత్రి హరీశ్‌రావు పర్యటన షెడ్యూల్
ఉదయం 10:20 గంటలకు కోస్గిలో 50 పడకల దవాఖానకు శ్రీకారం. అంబేద్కర్, ముదిరాజ్ భవనాలకు శంకుస్థాపన. అనంతరం కోస్గి జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ
* 11:15 గంటలకు మక్తల్ 150 పడకల దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన
* కృష్ణ మండలంలో ఫైర్ స్టేషన్, పీహెచ్సీ, ఏఎంసీ కార్యాలయం ప్రారంభం.
* వేర్‌హౌస్ బిల్డింగ్, రెండు కేజీబీవీల భవన నిర్మాణానికి శంకుస్థాపన
* గుడిగండ్ల, కర్నెలో 33/11 కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన
* మక్తల్ సమీపంలోని పంప్‌హౌస్ వద్ద బహిరంగ సభ
* 2:30 కొత్తకోటలో రోడ్‌షో. కొత్తకోటలో 30 పడకల సీహెచ్‌సీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన.
* మదనాపురంలో 136 డబుల్బెడ్రూం ఇండ్ల ప్రారంభం
* ధోబీఘాటు, కమ్యూనిటీహాళ్లు, బీటీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభ. అనంతరం తిరుగు ప్రయాణం
మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..
మక్తల్ టౌన్/కోస్గి, అక్టోబర్ 3 : మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి హాజరవుతున్న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో మాట్లాడారు. సభావేదికను అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ పరిశీలించారు. అలాగే కోస్గి మండలంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటన సందర్భంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

