అట్టహాసంగా..రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
పట్టణంలోని బాదేపల్లి ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం 32వ సబ్ జూ నియర్స్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
- హోరాహోరీగా సాగిన మొదటిరోజు లీగ్ మ్యాచ్‌లు
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 28 : పట్టణంలోని బాదేపల్లి ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం 32వ సబ్ జూ నియర్స్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 30వ తేదీవరకు నిర్వహించనున్న ఖో ఖో పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు తరలివచ్చాయి. పోటీలను జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ముం దుగా క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మడి 10 జిల్లాల జట్ల క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యేకు గౌరవవందనం సమర్పించారు. మొదటిరోజు లీగ్ మ్యాచ్‌లు పో టాపోటీగా సాగాయి. బాలుర విభాగం మొదటి లీగ్ మ్యాచ్‌ల్లో వరంగల్ జట్టు పై ఆదిలాబాద్ జట్టు, నల్గొండపై రంగారెడ్డి, ఖమ్మంపై మెదక్, నిజామాబాద్‌పై కరీంనగర్, నల్గొండపై హైదరాబాద్, హైదరాబాద్‌పై వరంగల్ జట్టు విజయం సాధించాయి. అలాగే బాలికల విభాగంలో నిజామాబాద్‌పై ఖమ్మం జట్టు గెలుపొందింది. ఆదిలాబాద్ జట్టుపై వరంగల్ విజయం సాధించింది. కరీంనగర్ జట్టుపై నల్గొండ, ఖమ్మంపై మహబూబ్‌నగర్, హైదరాబాద్‌పై మెదక్ గెలుపొందగా, ఆదిలాబాద్ జట్టుపై రంగారెడ్డి జట్టు గెలిచింది. కరీంనగర్ జట్టుపై ఖమ్మం జట్టు విజయం సాదించింది.
విద్యార్థులకు క్రీడలు అవసరం
ప్రతి విద్యార్థికీ క్రీడలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్స వం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని సూచించారు. గ్రామీణస్థాయిలో ఖోఖో క్రీడాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పో టీలు జడ్చర్లలో నిర్వహించడంపై సం తోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, ఖోఖో అసోసియేషన్ సహాయకార్యదర్శి కృష్ణమూర్తి, జి ల్లా కార్యదర్శి విలియం, జెడ్పీ వైస్‌చైర్మ న్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దో రేపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

