ఇప్పట్లో లేనట్లే!
రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామంటున్న సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల్లో ప్రజాపాలనను తీసుకురావడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బీసీ కులగణన ప్రక్రియ నేపథ్యంలో కనీసం రెండు, మూడు నెలలు జాప్యం కావొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఆశావహులతోపాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొన్నది.
- సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం
- బీసీ కులగణన తేలితేనే ముందుకు..
- ఫిబ్రవరి ఒకటితో ముగిసిన సర్పంచుల పాలన
- నిధుల్లేక నీరసిస్తున్న పంచాయతీలు
- మొక్కుబడిగా ప్రత్యేకాధికారుల విధులు
- కొరవడిన జవాబుదారీతనం
- రాష్ట్రంలో సరే.. గ్రామాల్లో ప్రజాపాలన ఇంకెప్పుడు?
నాగర్‌కర్నూల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామంటున్న సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల్లో ప్రజాపాలనను తీసుకురావడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బీసీ కులగణన ప్రక్రియ నేపథ్యంలో కనీసం రెండు, మూడు నెలలు జాప్యం కావొచ్చని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఆశావహులతోపాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొన్నది. ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగియడంతో నాటినుంచి గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల మొక్కుబడి విధులతో ప్రజలకు జవాబుదారీతనం పూర్తిగా కరువైంది. ఫలితం గా నిధుల విడుదల లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారం గాలిలో దీపంలా మారింది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహ ణ మరింత జాప్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1తో గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీం తో సర్పంచ్ పదవులకు ఎన్నికలు ఇదిగో, అదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఇప్పటికే పంచాయతీ శాఖ అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను చేపట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అ డ్డుగా మారింది. ఇంతకు ముందు జూన్‌లో ఖచ్చితం గా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్న సీఎం రేవంత్ బీసీ కులగణన ప్రక్రియ వల్ల రాబోయే రెండు, మూడు నెలలు జాప్యం కావొచ్చని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకున్న ఆశావహులు నిరాశకు గురయ్యారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆశావహులు గ్రామాల్లో తమ పార్టీలకు మంచి మెజార్టీ వచ్చేలా ఎన్నికల ప్రక్రియ లో పాల్గొన్నారు. అలాంటి నేతలతోపాటు ప్రజలకూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
గ్రామస్థాయిలోని సమస్యలను ఏ సమయంలోనైనా వార్డు సభ్యులు, సర్పంచులకు చెప్పుకొనే ప్రజలకు ప్రత్యేకాధికారుల దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. అధికారులకు తమ శాఖల విధులు, నిధులు లేకపోవడంతో సమస్యలు పరిష్కరించ డం ఇబ్బందికరంగా మారింది. 15వ ఫైనాన్స్ నిధు లూ రావడం లేదు. ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే జరిగాయి. ఈ కారణంగా ప్రత్యేకాధికారులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ పనులకు అవసరమైన నిధులు సైతం వెచ్చించే పరిస్థితులు లేవు. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున పాత రిజర్వేషన్లతో ముందుకెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత రెండు పర్యాయాల్లోనూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. పాత రిజర్వేషన్లే ఉంటే బీఆర్ఎస్కు ఆదరణ వస్తుందన్న ఉద్దేశంతో కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామని ఓ వైపు చెప్తూ అదే గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రజలకు దగ్గరగా ఉండే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో సర్పంచు లు, వార్డుసభ్యులే ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాపాలకులుగా ఉంటారు. కానీ ఆ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రభుత్వ వైఖరితో ఇప్పుడు మరికొన్ని నెలలు జాప్యమవుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవులకు పోటీపడాలనుకునే నాయకులు, ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
బీసీ రిజర్వేషన్లపై తేలాల్సి ఉంది..
పంచాయతీ ఎ న్నికల నిర్వహణపై ప్రభుత్వ ఆదేశం తో ముందుకు వె ళ్తాం. ఎన్నికల ని ర్వహణకు కోసం ఇప్పటివరకు జిల్లా కు 1800 బ్యాలె ట్ బాక్సులు రాగా ఇంకో 1300 బా క్సులు కర్ణాటక నుంచి తీసుకొచ్చే లా చర్యలు తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉన్నది. 15వ ఫైనాన్స్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ,ఎస్టీ నిధులు రూ.3కోట్లు వచ్చాయి. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పారిశుధ్యం, తాగునీటి నిర్వహణ తదితర పనులు చేపడుతున్నాం.
– కృష్ణ, డీపీవో, నాగర్‌కర్నూల్ జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

