Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Sand Dumps | రైల్వే పనుల కోసం ఇసుకను నిల్వ చేస్తున్నామనే పేరుతో భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు మాగనూరు మండల పరిధిలో చర్చనీయాంశంగా మారాయి.
మాగనూరు : రైల్వే పనుల ( Railway Works ) కోసం ఇసుకను నిల్వ చేస్తున్నామనే పేరుతో భారీగా ఇసుక డంపులు (Sand Dumps ) ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు మాగనూరు ( Maganur ) మండల పరిధిలో చర్చనీయాంశంగా మారాయి. రైల్వే పనులకు అవసరమైన ఇసుక నిల్వల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంప్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
రైల్వే పనుల కోసం ఇసుకను నిల్వ చేయడం తప్పు కాకపోయినా, అందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఇసుక ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు ఉన్నాయా? నిల్వలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. ఇసుక డంపుల వ్యవహారంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు తీసుకోలేదు : తహసీల్దార్
రైల్వే పనుల నిమిత్తం ఇసుకకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తహసీల్దార్ రెహమాన్ వెల్లడించారు. పెద్ద మొత్తంలో వేసిన ఇసుక డంపులను పరిశీలించడానికి ఆర్ఐ సుధాకర్, సిబ్బందిని పంపించానని అక్రమంగా ఇసుక డంపులు వేసినట్లయితే ఇసుక డంపులు సీజ్ చేస్తామన్నారు. రాత్రివేళలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

