జైలునుంచి నిందితుడి పరారీ
ఓ మైనర్‌ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వనపర్తి జిల్లా దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన సోమవారం చోటు చేసుకున్నది.
- నందిమళ్ల శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
- వనపర్తి దవాఖానలో చికిత్స పొందుతున్ననిందితుడు
- ఊపిరి పీల్చుకున్న జైలు అధికారులు
- ఘటనపై జిల్లా జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ డీఐజీ
వనపర్తి,జులై 6(నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్/అమరచింత, జూలై 6 : ఓ మైనర్‌ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వనపర్తి జిల్లా దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన సోమవారం చోటు చేసుకున్నది.
మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఎస్సై శ్రీన య్య తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమళ్ల గ్రా మానికి చెందిన కిశోర్‌కుమార్‌రెడ్డి (22) అదే గ్రామానికి చెందిన మైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే బాలిక మైనర్ కావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి జూన్ 12న కోర్టులో హాజరుపర్చగా కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. అప్పటి నుంచి జిల్లా జైలులోని సాధారణ బారక్‌లో ఉంచగా బాలికను జిల్లా కేంద్రంలో సఖీ సెంటర్లో ఉంచినట్లు తెలిసింది.
18 అడుగుల జైలు గోడ దూకి పరారీ
మహబూబ్‌నగర్ జిల్లా జైలు బ్రిటిషు కాలం నాటి కట్టడాలతో లోపల ఖైదీలకు అత్యంత భద్రత మధ్య జైలు అధికారులు పర్యవేక్షణ చేస్తుంటారు. అయితే నిందితుడు కిశోర్‌కుమార్‌రెడ్డి గత 25 రోజుల నుంచి జిల్లా జైలు లో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమం లో సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళుతు న్నా అని చెప్పి వెళ్లి అక్కడికి వెళ్లాడు. క్యాం టిన్ వెనుక భాగంలో ఉన్న 18 అడుగులు పెద్ద గోడ మీదికి ఎక్కాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న మూడు టవల్స్‌ను అక్కడే ఉన్న ఇనుప రాడ్‌కు కట్టి వెలాడదీసి వాటి సాయం తో కిందకు దూకినట్లు జైలు అధికారులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే పరారైన నిందితుడు జైలు నుంచి తన స్వగ్రామమైన నందిమళ్లకు వెళ్లాడని అతడి తండ్రికి ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించి వారి తండ్రిని సంప్రదించగా తన కొడుకు ఫోన్ చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ పోలీసులు వెంటనే ఆత్మకూర్, అమరచింత పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడి కోసం వెతికి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిందితుడు నానో యూరియా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా గమనించిన చుట్టుపక్కన పొలాల వారు అంబులెన్స్‌తోపాటు పోలీసులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు అటు నుంచి వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. నిందితున్ని పరీక్షించిన వైద్యు లు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటల పాటు డాక్టర్ల సంరక్షణలో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. జైలు నుంచి పారిపోయిన నిందితుడు చిక్కడంతో జిల్లా జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడికి కొన్ని రోజులు అయితే బెయిల్ వస్తున్న క్రమంలో ఇలా జైలునుంచి పారిపోయినందుకు శిక్ష మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
జిల్లా జైలుకు చేరుకున్న జైళ్లశాఖ డీఐజీ
పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న ఖైదీ జిల్లా జైలు గోడ దూకి పరారైన విషయం తెలుసుకున్న జైళ్లశాఖ డీఐజీ జిల్లా జైలుకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జైలు నుంచి నిందితుడు పారిపోతుంటే మీరు ఏం చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో విధుల్లో ఉన్న జైలర్తోపాటు నలుగురు సిబ్బందిపై కూడా వేటు పడినట్లు సమాచా రం. అయితే ఖైది కిశోర్‌కుమార్‌రెడ్డి క్రీడాకారుడు కావడంతోపాటు పొడవుగా చురుకుగా ఉండడంతో గోడను సులువుగా దూకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

