Cotton crop | వర్షాభావంతో పత్తి పంటకు తీవ్ర నష్టం : సక్రియ నాయక్
వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఊట్కూర్, నవంబర్ 12: వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామ శివారులో ఎండిపోయిన పత్తి, వరి, కంది పంటలను జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల పరిస్థితిని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండిపోయిన పంటలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, పంట నష్టం సర్వే, గణన, అంచనా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కతలప్ప మాట్లాడుతూ గ్రామంలో సుమారు 95 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేశారని, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేసిన రైతులకు ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పంట నష్టం వివరాల నమోదు, సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్, రాము, మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

