Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
Drinking Water Pipeline | మాగనూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టే సమయంలో ఇప్పటికే ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా..? పైపులైన్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Drinking Water Pipeline | మాగనూరు : ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన అధికారులు, నిర్మాణ పనుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదా..? అన్న ప్రశ్నలు మాగనూరు మండలం ఓబులాపూర్ గ్రామంలో తలెత్తుతున్నాయి. గ్రామంలో బీబీజీ రామ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజీ కాలువలో మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ ఉండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పైపులైన్‌కు లీకేజీ ఏర్పడితే డ్రైనేజీలోని మురుగునీరు తాగునీటి సరఫరాలో కలిసే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
నిర్మాణంలో ముందుచూపు ఏదీ?
గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టే సమయంలో ఇప్పటికే ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా..? పైపులైన్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీ కాలువలోనే తాగునీటి కనెక్షన్ల పైపులు ఉండటం వల్ల భవిష్యత్తులో లీకేజీలు ఏర్పడితే మురుగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిది..?
తాగునీటి పైపులైన్ లీకేజీ జరిగి మురుగునీరు సరఫరాలో కలిస్తే గ్రామ ప్రజలు కలుషిత నీటిని తాగే ప్రమాదం ఉంది. దీంతో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే సమస్యను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించి పైపులైన్ భద్రతపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. డ్రైనేజీ నిర్మాణ నాణ్యతను తనిఖీ చేసి, తాగునీటి పైపులైన్‌కు రక్షణ కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందులో నిర్లక్ష్యం జరిగితే దాని ప్రభావం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతుంది. ఓబులాపూర్‌లో తాగునీటి పైపులైన్ భద్రతపై అధికారులు ఇప్పటికైనా స్పందించి, లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటారా? లేక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే వరకు వేచి చూస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

