Kollapur | కొల్లాపూర్‌లో ఘనంగా హోలీ సంబురాలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ పుర వీధుల్లో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు.
కొల్లాపూర్, మార్చి 14: కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పట్టణ పుర వీధుల్లో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి కాముని దహన కార్యక్రమంలో గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగుల పండుగ హోలీ, అందరీ జీవితాలను రంగులతో నింపాలన్నారు. ఈ హోలీ నాడు కష్టాలన్నీ తొలగించాలని, జీవితం అనందమయం కావాలని కోరుకుంటున్నాని చెప్పారు.
కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ పండుగలో పాల్గొన్నారు. రామాలయం వద్ద బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ కార్యకర్తల యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

